తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహాబలేశ్వర్​లో రికార్డు స్థాయి వర్షపాతం - మహాబలేశ్వర్​లో వర్షపాతం

మహారాష్ట్ర సతారా జిల్లాలోని మహాబలేశ్వర్​లో ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదైంది. కేవలం తొమ్మిది రోజులో 2,829 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.

record rainfall in mahabaleshwar
మహాబలేశ్వరంలో కుంభవృష్టి

By

Published : Jul 27, 2021, 8:34 PM IST

మహారాష్ట్రలోని మహాబలేశ్వర్​లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ప్రముఖ హిల్​ స్టేషన్​గా పేరొందిన ఈ ప్రాంతంలో కేవలం తొమ్మిది రోజుల్లో 2,829 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా జులై 22, 23 తేదీల్లో వరుసగా 480మి.మీ, 574 మి.మీ మేర వర్షం కురిసింది.

రోడ్లన్నీ జలమయం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల ఈ ఏడాది అధిక వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో చెట్లు అధికంగా ఉండడం వల్ల మేఘాలు కొండలను తాకుతున్నాయి. దీంతో భారీగా వర్షం కురిసినట్లు పేర్కొన్నారు.

ఓ రెస్టారెంట్​ ముందు భారీగా చేరుకున్న వరద నీరు

ఈ భారీవర్షాల కారణంగా సమీపంలో ఉన్న చెరువులు నిండాయి. రహదారులపై నీరు పెద్దఎత్తున నిలిచిపోయింది. పొలాలు అన్నీ నేలమట్టమయ్యాయి.

వరద ధాటికి నిలిచిపోయిన వాహనం

తేదీల వారీగా వర్షపాతం వివరాలు(మి.మీలో)

  • జులై 19- 97.8
  • జులై 20- 109.8
  • జులై 21- 164.0
  • జులై 22- 480.0
  • జులై 23- 594.4
  • జులై 24- 321.0
  • జులై 25-186.7
  • జులై 26 - 85.2
  • జులై 27 - 85.2

మహాబలేశ్వర్​ తరువాత రాయ్​ఘడ్​, రత్నగిరి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది.

ఇదీ చూడండి:నరమాంసం తింటూ.. పుర్రెతో నృత్యాలు!

ABOUT THE AUTHOR

...view details