తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తిరుగుబాటు అభ్యర్థులను పోటీ నుంచి తప్పించడంలో కాంగ్రెస్​ పార్టీ సక్సెస్ - భవిష్యత్‌లో పదవుల భరోసాతో దారికొచ్చిన రెబల్స్

Rebel Candidates Withdraw Nominations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన తిరుగుబాటు అభ్యర్థులను పోటీ నుంచి తప్పించడంలో కాంగ్రెస్​ పార్టీ సఫలీకృతమైంది. నామపత్రాల ఉపసంహరణ ఆఖరి రోజు కావడంతో కాంగ్రెస్ నేతలు దౌత్యంతో కొందరు రెబల్స్ ఉపసంహరించుకున్నారు. భవిష్యత్​లో పదవులిస్తామనే భరోసాతో వారు దారికొచ్చారు. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులకు కాస్త ఊరట లభించింది.

Rebel Candidates Withdraw Nominations in Telangana
Rebel Candidates

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2023, 9:43 PM IST

రెబల్ అభ్యర్థులతో కాంగ్రెస్ సంప్రదింపులు సఫలం - బరిలో నిలిచిన అభ్యర్థులకు ఊరట

Rebel Candidates Withdraw Nominations in Telangana : రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో బరిలో ఉన్న తిరుగుబాటు అభ్యర్థులను పోటీ నుంచి తప్పించడంలో హస్తం పార్టీ సఫలీకృతమైంది. నామపత్రాల ఉపసంహరణ ఆఖరి రోజున హస్తం నాయకుల దౌత్యంతో కొందరు రెబల్స్‌ ఉపసంహరించుకున్నారు. చాలాచోట్ల బుజ్జగించి భవిష్యత్‌లో పదవులిస్తామనే భరోసాతో దారికొచ్చారు. ఫలితంగా బరిలో నిలిచిన అభ్యర్థులకు కాస్త ఉపశమనం లభించింది. ఓట్లు చీల్చి ఫలితాలు తారుమారు చేస్తారనే భయం తొలగింది.

Telangana Assembly Elections 2023 :అసెంబ్లీ ఎన్నికల సమరంలో అన్ని పార్టీలకు తలనొప్పిగా మారిన రెబల్స్‌ను బుజ్జగించడం కలిసొచ్చింది. చాలా స్థానాల్లో తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో దిగినవారంతా దాదాపుగా పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రధాన విపక్షం కాంగ్రెస్‌ నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డవారంతా అసంతృప్తితో ఇతర పార్టీల నుంచి, స్వతంత్రులుగా బరిలో దిగారు.

Rebel Candidates Withdraw Nominations : నష్ట నివారణ కోసం రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆశావహులను బుజ్జగించింది. ఈ క్రమంలో ఇవాళ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సూర్యాపేటలో టికెట‌్ రాక ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి నామినేషన్‌ వేసిన పటేల్‌ రమేశ్​రెడ్డిని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి సముదాయించారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ సీటు ఇస్తామనే హామీతో దిగొచ్చిన పటేల్‌ రమేశ్​రెడ్డి నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు.

తెలంగాణపై ఏఐసీసీ బృందాల ఫోకస్‌ - అభ్యర్థులతో సంబంధం లేకుండా తెరవెనుక రాజకీయం

ఇదే కోవలో చాలా నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులను బుజ్జగించి దారిలోకి తెచ్చుకున్నారు. ఇబ్రహీంపట్నంలో అలకవీడిన దండెం రాంరెడ్డి నామపత్రాలను వెనక్కి తీసుకున్నారు. జుక్కల్‌లో కాంగ్రెస్‌ రెబల్‌ గంగారం, బాన్సువాడలో బాలరాజు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. డోర్నకల్‌లో నెహ్రూ నాయక్, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో జంగా రాఘవరెడ్డిని పోటీ నుంచి తప్పించడంలో కాంగ్రెస్‌ అధినాయకత్వం విజయవంతమైంది. జూబ్లీహిల్స్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచిన నవీన్‌ యాదవ్‌ నామినేషన్‌ వెనక్కి తీసుకున్నారు. కాంగ్రెస్‌లో చేరతారని ఆయన సన్నిహితులు తెలిపారు. మొత్తంగా ఓట్లు చీలకుండా, పోటీలో ఉన్న అభ్యర్థులను గెలిపించే వ్యూహాలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ సఫలీకృతమైంది.

Telangana Congress Focus on Assembly Elections :కాంగ్రెస్​ నాలుగు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ జాబితాలో టికెట్​ దక్కని కాంగ్రెస్​ అభ్యర్థులు బహిరంగంగానే.. కాంగ్రెస్​ అధిష్ఠానంపై తీవ్ర విమర్శలు చేశారు. గాంధీభవన్​కు వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన గళం విప్పారు. తమకు టికెట్లు ఇవ్వకపోతే రెబెల్స్​గా కాంగ్రెస్​కు వ్యతిరేకంగానే ఎన్నికల బరిలో నిలుస్తామని సవాల్​ విసిరారు. అయితే తాజాగా తిరుగుబాటు అభ్యర్థులను పోటీ నుంచి తప్పించడంతో ప్రధాన పార్టీలు సఫలీకృతమయ్యాయి. నామపత్రాల ఉపసంహరణ ఆఖరి రోజున కాంగ్రెస్ నేతలు దౌత్యంతో కొందరు రెబల్స్‌ ఉపసంహరించుకున్నారు.

కాంగ్రెస్​ రెబెల్స్​ను బుజ్జగించే పనిలో ఉన్న కాంగ్రెస్​ అధిష్ఠానం

కొత్తగూడెం సీటు వ్యవహారం - ఇంతకీ ఆ సీటు వామపక్షాలకు ఇచ్చినట్టేనా?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details