తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముగ్గురు భార్యలు.. విలాసవంతమైన జీవితం.. కళ్లలో కారం చల్లి హత్య!

Realtor murdered: ముగ్గురు భార్యలు.. విలాసవంతమైన జీవితం కట్​ చేస్తే.. కళ్లలో కారం చల్లి ఆ స్థిరాస్తి వ్యాపారిని దారుణంగా హత్య చేశారు కొందరు దుండగులు. ఈ సంఘటన కర్ణాటకలోని బెళగావి నగరంలో మంగళవారం తెల్లవారు జామున జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Realtor murdered
స్థిరాస్తి వ్యాపారి రాజు మల్లప్ప

By

Published : Mar 16, 2022, 4:35 PM IST

Updated : Mar 16, 2022, 7:29 PM IST

Realtor murdered: కర్ణాటకలోని బెళగావిలో మంగళవారం ఉదయం దారుణ హత్య జరిగింది. రాజు మలప్ప దొడ్డబణ్నవర్​(46) అనే స్థిరాస్తి వ్యాపారిని గుర్తుతెలియని కొందరు దుండగులు దారుణంగా పొడిచి చంపేశారు. మృతుడి శరీరంపై పదునైన ఆయుధంతో 16 సార్లు దాడి చేసినట్లు డీసీపీ రవీంద్ర తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు.

మూడో భార్యతో రాజు

ఇదీ జరిగింది..

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్యను కలిసేందుకు మంగళవారం ఉదయం కారులో వెళ్లారు రాజు. మార్గ మధ్యలో కారును అడ్డగించిన దుండగులు.. కళ్లలో కారం చల్లి దాడి చేశారు. పదునైన ఆయుధాలతో పొడిచారు. దీంతో రాజు ప్రాణాలు కోల్పోయారు.

హత్య జరిగిన ప్రాంతంలో పోలీసుల తనిఖీలు

ఉదయపు నడక కోసం అటుగా వెళ్లిన కొందరు చూసి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం తరలించారు. 'రాజు దొడ్డబణ్నవర్​ స్థిరాస్తి వ్యాపారి. ఆయన కాళ్లపై తీవ్రగాయాలయ్యాయి' అని పోలీస్​ కమిషనర్​ డాక్టర్​ ఎంబీ బోరలింగయ్య తెలిపారు.

రెండో భార్యతో రాజు

ముగ్గురు భార్యలు..

రాజు దొడ్డబణ్నవర్​ 22 ఏళ్ల క్రితం ఉమ అనే మహిళను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారు వైద్య విద్యనభ్యసిస్తున్నారు. 8ఏళ్ల క్రితం మహారాష్ట్రలోని లాథూర్​లో కిరణ అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నారు రాజు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకుని.. నాలుగేళ్ల క్రితం భర్త, పిల్లలను వదిలేసి బెంగళూరు వెళ్లి ఒంటరిగా జీవిస్తోంది మొదటి భార్య ఉమ. ఆ తర్వాత.. హలియాల్​ తాలూకకు చెందిన దీపాలిని వివాహం చేసుకున్నారు రాజు. ఆమె ప్రస్తుతం మూడు నెలల గర్భిణీ. స్థిరాస్తి వ్యాపారిగా.. ముగ్గురు భార్యలతో హుందాగా జీవించేవాడని స్థానికులు చెబుతున్నారు.

మొదటి భార్యతో రాజు

కొన్ని రోజుల క్రితం నలుగురు వ్యక్తులు రాజు కోసం ఆయన ఇంటికి వచ్చారు. సెక్యూరిటీ గార్డ్స్​ వారిని లోపలికి అనుమతించలేదు. దీని గురించి తెలుసుకున్న మృతుడు వ్యాపారం గురించి అనుకుని వదిలేశారు. అయితే, మంగళవారం హత్యకు గురికావటం పలు అనుమానాలకు తావిస్తోందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని భరోసా కల్పించారు.

ఇదీ చూడండి:ఎయిమ్స్​ వైద్యుల నిర్లక్ష్యం.. హెచ్​ఐవీ బ్లడ్​తో బాలిక మృతి

Last Updated : Mar 16, 2022, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details