తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శ్మశానాలకు కుప్పలుగా కొవిడ్​ మృతదేహాలు - గుజరాత్ సూరత్​ వార్తలు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొవిడ్​ మరణాలు సైతం భారీగా పెరిగాయి. శ్మశానవాటికల వద్ద మృతదేహాలతో గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. గుజరాత్​ సూరత్‌లో గడిచిన 3 రోజుల్లోనే 90 మంది మృతి చెందారు. ఆసుపత్రుల్లో పడకలు లేక అంబులెన్సుల్లోనే వేచి ఉంటున్నారు బాధితులు.

surat corona deaths
సూరత్ కరోనా మరణాలు

By

Published : Apr 15, 2021, 8:11 AM IST

కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. దేశంలో ఎన్నడూ లేనంత స్థాయిలో విరుచుకుపడుతోంది. ఆసుపత్రుల్లోని పడకలన్నీ నిండిపోయాయి. శ్మశానాల్లో అంత్యక్రియలకూ గంటల కొద్ది వేచిచూడాల్సి వస్తోంది.

సూరత్​లో రాత్రి సమయంలోనూ దహన సంస్కారాలు

సూరత్​లో 3 రోజుల్లో 90 మంది మృతి

గుజరాత్​లోని సూరత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 3 రోజుల్లోనే 90 మంది కొవిడ్​ బాధితులు మృతి చెందారు. అంతిమ సంస్కారాల కోసం శ్మశానవాటికల వద్ద గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా లింబాయత్​ ప్రాంతంలోని ముక్తిధామ్​, పాల్​లోని శ్రీ కైలాష్ మోక్షధామ్​ ట్రస్ట్ శ్మశానవాటికకు మృతదేహాలు కుప్పలుగా వస్తున్నాయి. అక్కడ మొదటి రోజు 10, రెండో రోజు 30, మూడో రోజు 17 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.

అంత్యక్రియలకు తీసుకెళుతున్న బంధువులు
శ్మశానం వద్ద వేచి ఉన్న అంబులెన్సులు

బెంగళూరులో..

కర్ణాటకలోని బెంగళూరు నగర మున్సిపాలిటీ శ్మశానవాటికకు వస్తున్న కరోనా మృతదేహాలతో అక్కడి ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. శ్మశానవాటిక సమీపంలో మృతదేహాలతో ఉన్న అంబులెన్సులు బారులు తీరాయి. ఒక మృతదేహాన్ని దహనం చేసేందుకు కనీసం గంటన్నర సమయం పడుతోందని సిబ్బంది తెలిపారు. అయితే శ్మశానవాటికలో సేవలందించే తమకు పీపీఈ కిట్లు, గ్లవ్స్, శానిటైజర్ వంటి కనీస సౌకర్యాలు లేవని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

మున్సిపల్​ శ్మశానవాటిక వద్ద నిలిచి ఉన్న అంబులెన్సులు

కొవిడ్ కారణంగా మరణించిన వారి మృతదేహాల అంతిమ సంస్కారాలకు ఐదు శ్మశానవాటికలను కేటాయించారు. అయితే కొన్నిచోట్ల ఈ యంత్రాలు సరిగా పనిచేయట్లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

దేశ రాజధానిలో స్థలం కొరత..

దిల్లీ ఐటీఓ ప్రాంతంలోని అతిపెద్ద శ్మశానవాటిక అయిన జాదిద్ ఖబ్రస్థాన్​లో కరోనా మృతులను ఖననం చేసేందుకు స్థలం లేదని నిర్వాహకులు తెలిపారు. మరో 150-200 మృతదేహాలను ఖననం చేసేందుకు మాత్రమే స్థలం ఉన్నట్లు తెలిపారు.

దిల్లీలోని జాదిద్ ఖబ్రస్థాన్​లోని దృశ్యం
జాదిద్ ఖబ్రస్థాన్​లో కరోనా మృతదేహాన్ని పూడ్చిపెట్టిన సిబ్బంది

ఇవీ చదంవడి:కొవిడ్ పంజా-'మహా'లో కొత్తగా 59వేల కేసులు

పడకల కొరత- అంబులెన్సుల్లోనే చికిత్స

ABOUT THE AUTHOR

...view details