భారతీయ జనతా పార్టీ ఇచ్చే ఏ బాధ్యత స్వీకరించడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు మెట్రోమ్యాన్ శ్రీధరన్ తెలిపారు. కేరళ అభివృద్ధి కోసం తన శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. తిరువనంతపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్న ఓ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"67 ఏళ్లు ప్రభుత్వాధికారిగా పనిచేశా. ఇన్ని సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి ఎందుకొచ్చానని చాలామంది అడిగారు. అయితే 67 ఏళ్ల పాటు ఈ దేశం కోసం ఎన్నో ప్రాజెక్టుల్లో పనిచేశా. ఇప్పటికీ శక్తిమంతంగా ఉన్నా. నాకు ఏ బాధ్యత ఇచ్చినా ధైర్యంగా, సమర్థవంతంగా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నా."