తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వాళ్లు కోరితే రాజీనామాకు సిద్ధమే' - Bengal polls

తనను రాజీమానా చేయలన్న బంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా స్పందించారు. బంగాల్ ప్రజలు కోరితే రాజీనామాకు సిద్ధమేనన్నారు. మరోవైపు ఓటర్లు బెదిరించడానికి భాజపా కుట్రలు చేస్తోంది ఆరోపించారు దీదీ.

Amit Shah, Mamata
అమిత్​ షా, మమత

By

Published : Apr 11, 2021, 9:12 PM IST

బంగాల్​ ప్రజలు కోరితే రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నాల్గోదశ పోలింగ్‌ సందర్భంగా జరిగిన కూచ్‌బిహార్‌ కాల్పుల ఘటనపై అమిత్​ షా రాజీనామా చేయాలని సీఎం మమతా బెనర్జీ డిమాండ్​ చేశారు. దీనిపై స్పందించిన షా ఈ వ్యాఖ్యలు చేశారు.

"నన్ను రాజీనామా చేయమని దీదీ డిమాండ్​ చేశారు. బంగాల్​ ప్రజలు కోరితే.. వారి ముందు తలవంచి అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాను."

-అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసీర్​హాట్​లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న షా.. ఎన్నికల్లో తృణమూల్​ కాంగ్రెస్​కు ఓటమి తప్పదని అన్నారు. మే 2న దీదీ.. సీఎం పీఠం దిగాల్సిందేనన్నారు.

ఇదీ చూడండి:కూచ్​ బిహార్​ కాల్పులే ప్రచారాస్త్రం!

భాజపా కుట్ర

మరోవైపు.. ప్రజలను బెదిరించడానికి కూచ్​బిహార్​ ఘటనతో భాజపా కుట్ర పన్నిందని ఆరోపించారు దీదీ. జల్​పాయ్​గుడి జిల్లాలో ప్రచారం నిర్వహించిన దీదీ.. భాజపాకు ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా సీఐఎస్​ఎఫ్​ సిబ్బందిపై విమర్శలు గుప్పించారు మమత. "ఎవరైన గందరగోళానికి పాల్పడినట్లు భావిస్తే.. వారితో మాట్లాడాలి. లేదా లాఠీ ఛార్జ్​ చేయాలి. అంతేకానీ.. తుపాకులు ఎలా తీస్తారు?" అని బలగాలను ప్రశ్నించారు.

ఇదీ చూడండి:'కూచ్​బిహార్ ఘటన మారణహోమమే​'

ABOUT THE AUTHOR

...view details