తాలిబన్ల వ్యవహారం సహా కశ్మీర్ లోయలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ఉద్ఘాటించారు. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న క్రమంలో కశ్మీర్‌కు ముప్పు పొంచి ఉందనే ఆందోళనల మధ్య ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రతా దళాలు అనునిత్యం అప్రమత్తంగా ఉంటున్నాయని, ఉగ్రమూకల ఏరివేతకు సంసిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
తాలిబన్లకు కశ్మీర్ ఐజీపీ స్ట్రాంగ్ వార్నింగ్ - కశ్మీర్ ఐజీపీ
తాలిబన్లకు గట్టి హెచ్చరికలు పంపారు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్. లోయలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు నిత్యం అప్రమత్తంగా ఉన్నాయని పేర్కొన్నారు. తాలిబన్ల సమస్యను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.
![తాలిబన్లకు కశ్మీర్ ఐజీపీ స్ట్రాంగ్ వార్నింగ్ Kashmir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12837205-thumbnail-3x2-yv.jpg)
తాలిబన్
అయితే, కశ్మీర్‌ను ప్రశాంతంగా ఉంచాలంటే ప్రజల సహకారం కూడా కావాలని కోరారు విజయ్ కుమార్. ఉగ్రవాదులు, సూసైడ్ బాంబర్లకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేయాలని.. లేకపోతే నష్టపోయేది స్థానికులేనని వెల్లడించారు.
Last Updated : Aug 21, 2021, 6:45 PM IST