తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాష్ట్రపతిగా నా ఎన్నిక.. దేశ పేదలందరి విజయం: ముర్ము - రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​

Draupadi Murmu: భారత రాష్ట్రపతిగా ఎన్నికవడం తన ఒక్కరి ఘనత కాదని.. దేశ ప్రజలందరి విజయమని అన్నారు ద్రౌపదీ ముర్ము. పేదలు కలలు కనొచ్చని, వాటిని నిజం చేసుకోవచ్చని చెప్పేందుకు తన ఎన్నికే నిదర్శనం అన్నారు. భారత 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రసంగంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Reaching the Presidential post is not my personal achievement, it is the achievement of every poor in India
Reaching the Presidential post is not my personal achievement, it is the achievement of every poor in India

By

Published : Jul 25, 2022, 10:47 AM IST

Draupadi Murmu: భారత 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ద్రౌపదీ ముర్ము.. తనను అత్యున్నత పదవికి ఎన్నిక చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రపతిగా తన ఎన్నిక కోట్లాది భారతీయుల విశ్వాసానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్రపతిగా గెలుపొందడం తన ఒక్కరి ఘనత కాదని.. దేశ ప్రజలందరికీ దక్కిన విజయంగా ముర్ము అభివర్ణించారు. పేద ప్రజలు కలలు కని.. నిజం చేసుకోగలరనేందుకు తన ఎన్నికే నిదర్శనం అని పేర్కొన్నారు. పార్లమెంట్​ సెంట్రల్​హాల్​ వేదికగా రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి ప్రసంగించిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆజాదీకా అమృత్​ మహోత్సవ్​ వేళ.. భారత రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని అన్నారు ముర్ము. దేశంలో సమ్మిళిత అభివృద్ధి కోసం, అట్టుడుగు ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని పునరుద్ఘాటించారు. అందరి సహకారంతో ఉజ్వల యాత్ర కొనసాగిస్తానని తెలిపారు.

''దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తా. భారత్​ 'ఆజాదీకా అమృత్​ మహోత్సవ్​' ఉత్సవాలు జరుపుకుంటోంది. ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. 50 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల వేళ నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. 75 ఏళ్ల ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. ఒడిశాలోని చిన్న ఆదివాసీ గ్రామం నుంచి వచ్చి.. అత్యున్నత పదవి చేపట్టడం గౌరవంగా భావిస్తున్నా.''

ABOUT THE AUTHOR

...view details