తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భగత్​సింగ్'​ నాటకంలో బాలుడికి నిజంగా ఉరి! - ఉరి బిగుసుకుని బాలుడు మృతి

పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు తన నటనతో అందరిని ఆశ్చర్యానికి గురిచేయాలనుకున్నాడు ఆ బాలుడు. స్వతంత్ర సమరయోధుడు భగత్​సింగ్​కు ఉరి వేసే సన్నివేశంపై సాధన మొదలు పెట్టాడు. అదే అతనిపాలిట శాపంగా మారింది. ప్రమాదవశాత్తు మెడకు ఉరి బిగుసుకుని ప్రాణాలు కోల్పోయాడు.

Re-enacting Bhagat Singh's execution
భగత్​సింగ్​లా నటిస్తూ ఉరి వేసుకుని బాలుడు మృతి

By

Published : Jul 31, 2021, 7:35 PM IST

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. స్వతంత్ర సమరయోధుల వేషధారణల్లో విద్యార్థులు పాఠశాలల్లో వివిధ నాటకాలు ప్రదర్శిస్తారు. 15రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవం ఉన్న నేపథ్యంలో చేపట్టిన విద్యార్థుల నాటక ప్రదర్శన రిహార్సల్స్​లో విషాదం జరిగింది. భగత్​ సింగ్​ నాటకంలో భాగంగా ఉరి సన్నివేశంపై రిహార్సల్స్​ చేయబోయి ప్రమాదవశాత్తు ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బదవూన్​ జిల్లాలో జరిగింది.

ఇదీ జరిగింది..

జిల్లాలోని కున్వార్​గావూన్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బబత్​ గ్రామానికి చెందిన భురే సింగ్​ కుమారు శివమ్​ (10). పాఠశాలలో భగత్​ సింగ్​ నాటకంలో తోటి విద్యార్థులతో కలిసి రిహార్సల్స్​లో పాల్గొన్నాడు. భగత్​సింగ్​ను ఉరి తీసే సన్నివేశంలో.. శివమ్​ మెడ చుట్టూ తాడు చుట్టుకున్నాడు. అయితే.. అతను నిలుచున్న స్టూలు పడిపోయి.. మెడకు ఉరి బిగుసుకుంది. అక్కడే ఉన్న విద్యార్థులు భయంతో సాయం కోసం అరవగా.. స్థానికులు పరుగున వచ్చి కాపాడే ప్రయత్నం చేశారు. తాడును కత్తెరించి శివమ్​ను కిందకు దించారు. కానీ, అప్పటికే శివమ్​ ప్రాణాలు కోల్పోయాడు.

ఘటన జరిగిన క్రమంలో పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే బాలుడి అత్యక్రియలు ముగించారు కుటుంబ సభ్యులు.

సమాచారం తెలుసుకుని కున్వార్​గావూన్​ పోలీసులు గ్రామానికి వెళ్లారని, కానీ బాలుడి కుటుంబీకులు వివరాలు వెల్లడించేందుకు నిరాకరించినట్లు బదవూన్​ ఎస్​ఎస్​పీ సంకల్ప్​ శర్మ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:రూ.500కోసం తమ్ముడిని హత్య చేసిన అన్న

ABOUT THE AUTHOR

...view details