Ravi Kishan Brother Dead: టాలీవుడ్లో విలన్‌గా గుర్తింపు పొందిన నటుడు రవి కిషన్ సోదురుడు రవేశ్ కిషన్ కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రవికిషన్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తన అన్న ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేశారని అయినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే సోదురుడు కూడా మరణించడం తమ కుటుంబానికి తీరని లోటని, ఎంతో బాధాకరమని అన్నారు. తన అన్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రవికిషన్ నటుడు మాత్రమే కాదు.. యూపీ గోరఖ్‌పుర్ నియోజకవర్గం నుంచి భాజపా ఎంపీగా గెలుపొందారు. ఆయనకు ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.
టాలీవుడ్ విలన్ రవి కిషన్ ఇంట తీవ్ర విషాదం - actor ravi kishan brother news
Ravi kishan News: ప్రముఖ నటుడు, భాజపా ఎంపీ రవికిషన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రమేశ్ కిషన్ అనారోగ్యంతో ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
![టాలీవుడ్ విలన్ రవి కిషన్ ఇంట తీవ్ర విషాదం ravi-kishan-elder-brother-died-in-delhi-aiims-during-treatment](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14886241-thumbnail-3x2-img.jpg)
టాలీవుడ్ విలన్ రవి కిషన్ ఇంట తీవ్ర విషాదం
Last Updated : Mar 31, 2022, 10:59 AM IST