How Many Types Ration Cards in India :రేషన్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆధార్ కార్డు, పాన్ కార్డు మాదిరిగానే రేషన్ కార్డు కూడా చాలా ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ సంక్షేమ పథకాలు పొందాలంటే.. రేషన్ కార్డు(Ration Card)తప్పనిసరి అయింది. ఇవే కాదు.. ఈ రేషన్ కార్డు తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందొచ్చు. అయితే.. చాలా మందికి తెలియని విషయం ఏమంటే.. దేశంలో పలు రకాల రేషన్ కార్డులున్నాయి. వాటి ద్వారా వివిధ రకాల బెనిఫిట్స్ పొందవచ్చు. మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Different Types of Ration Cards in India : రేషన్ కార్డ్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే అధికారిక గుర్తింపు కార్డు. ఈ కార్డు సహాయంతో.. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) ప్రకారం సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను కొనుగోలు చేయవచ్చు. అయితే.. NFSA అమలులోకి రాకముందు రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు ఆధారంగా, అర్హత కలిగిన కుటుంబాలు టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (TPDS) ద్వారా సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను కొనుగోలు చేసేవి. ప్రస్తుతం 2013లో NFSA అమలులోకి వచ్చాక.. దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అర్హత కలిగిన కుటుంబాలకు మూడు రకాల రేషన్ కార్డులను జారీ చేస్తున్నాయి. ఇందులో అంత్యోదయ అన్నయోజన (AAY) కార్డు, ప్రియారిటీ హౌస్‌హోల్డ్(PHH) రేషన్ కార్డు, నాన్-ప్రియారిటీ హౌస్‌హోల్డ్(NPHH) రేషన్ కార్డులు అందిస్తున్నాయి. లబ్దిదారులు పొందే ప్రయోజనాలు.. కార్డు ప్రాతిపదికన మారుతూ ఉంటాయి.
NFSA 2013 కింద ప్రస్తుతం అందిస్తున్న రేషన్ కార్డులు..
అంత్యోదయ అన్న యోజన (AAY) రేషన్ కార్డు :
- ఈ రకమైన రేషన్ కార్డులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. స్థిరమైన ఆదాయం లేని పేద కుటుంబాలకు ఇస్తాయి.
- రిక్షా కార్మికులు, దినసరి కూలీలు వంటివారు ఈ జాబితాలోకి వస్తారు.
- నిరుద్యోగులు, మహిళలు, వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు కూడా ఈ కార్డును అందిస్తారు.
- ఈ కార్డులు కలిగిన ప్రతి కుటుంబాలు.. నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలు పొందేందుకు అర్హులు.
ప్రియారిటీ హౌస్‌హోల్డ్ (PHH) రేషన్ కార్డు :
- AAY పరిధిలోకి రాని కుటుంబాలు PHH పరిధిలోకి వస్తాయి.
- రాష్ట్ర ప్రభుత్వాలు వారి ప్రత్యేక సమగ్ర మార్గదర్శకాల ప్రకారం లక్ష్యిత ప్రజా పంపిణీ వ్యవస్థ (TPDS) కింద ప్రాధాన్యత కలిగిన గృహ కుటుంబాలను గుర్తిస్తాయి.
- PHH కార్డుదారులు ప్రతి వ్యక్తికీ.. నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలు అందుకుంటారు.
నాన్-ప్రియారిటీ హౌస్‌హోల్డ్(NPHH) రేషన్ కార్డు :