Air India Flight : సాధారణంగా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి ప్రయణాలు ఆలస్యమవుతుంటాయి. కానీ శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో మరికాపేట్లో టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఎయిర్ఇండియా విమానానికి మాత్రం ఓ ఎలుక తలనొప్పిగా మారింది. జమ్ముకు వెళ్లాల్సిన ఈ విమానంలో ఎలుక ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది దానిని పట్టుకునేందుకు దాదాపు రెండు గంటలు శ్రమించారు. దీంతో మధ్యాహ్నం 2.15 గంటలకు బయలుదేరాల్సిన విమానం.. 4.10 గంటలకు టేకాఫ్ అయింది.
ఎలుక దెబ్బకు ఆగిపోయిన టేకాఫ్.. డీజీసీఏ దర్యాప్తు - జమ్ముకశ్మీర్ వార్తలు
Air India Flight: మరికొద్ది సేపట్లో ఆ విమానం బయలుదేరేది. ఇంతలో ఉన్నట్లుండి ఆ విమానం టేకాఫ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు సిబ్బంది. దాదాపు రెండు గంటల తర్వాత ఆ విమానం డిపార్చర్ అయింది. ఈ ఘటన శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. ఈ ఆలస్యం అంతటికీ కారణం ఓ ఎలుక!
air india
ఇందుకు సంబంధించి డీజీసీఏ దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం జరిగిన ఈ ఘటనపై ఎయిర్ఇండియా ఇంకా స్పందించాల్సి ఉంది. ఎయిర్ఇండియా సంస్థ బాధ్యతలను టాటా చేపట్టాక ఈ తరహా ఘటనలు జరగడం ఇదే తొలిసారి. గతేడాది అక్టోబరు 8న ప్రభుత్వం నుంచి వేలంలో సంస్థను కొనుగోలు చేసిన టాటా సంస్థ.. ఈ ఏడాది జనవరి 27 నుంచి బాధ్యతలు అందుకుంది.
ఇదీ చూడండి :మాజీ సహోద్యోగిపై కోపం.. పబ్లిక్ టాయిలెట్లలో అలా..!
Last Updated : Apr 22, 2022, 4:46 AM IST