తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోగి కంటిని కొరికిన ఎలుక.. కుటుంబ సభ్యులదే బాధ్యత అని వైద్యుడి వాదన!

rat bite paralysed woman: రాజస్థాన్​లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. పక్షవాతంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ మహిళను ఎలుక కరవగా.. వైద్యుల స్పందనపై రోగుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు కుటుంబ సభ్యులది సైతం బాధ్యతే అని ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ చెప్పుకొచ్చారు.

rat bite paralysed woman
rat bite paralysed woman

By

Published : May 17, 2022, 9:40 PM IST

rat bite paralysed woman: రాజస్థాన్​లో వైద్యుల నిర్లక్ష్యం బట్టబయలైంది. ప్రభుత్వం ఎన్ని నిధులు విడుదల చేసినా.. నిర్వహణ మాత్రం అంతంతేనని తేటతెల్లమయ్యే ఘటన జరిగింది. కోటాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళను ఎలుకలు కరిచాయి. ఆస్పత్రి వర్గాలు మాత్రం ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించాయి.

వివరాల్లోకి వెళితే...:మహారావ్ భీమ్​సింగ్ వైద్య కళాశాలలో రూపవతి అనే ఓ మహిళా రోగి ఐసీయూలో చికిత్స పొందుతోంది. పక్షవాతం వ్యాధితో ఆమె ఆస్పత్రిలో చేరింది. శరీరంలోని ఏ భాగాన్నీ ఆమె స్వయంగా కదిలించలేదు. కాగా, సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆమె కంటిని ఎలుక కొరికింది. ఆ సమయంలో ఆమె భర్త.. పక్కనే ఉన్నారు. కంటి నుంచి రక్తం కారడాన్ని గమనించిన రూపవతి భర్త.. వైద్యులను సంప్రదించాడు. రోగిని పరిశీలించిన వైద్యులు.. ఆమెకు చికిత్స అందించారు. అవసరమైతే కంటి సర్జరీ నిర్వహిస్తామని తెలిపారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ

అయితే, అసలు ఎలుక కొరికిందో లేదో అన్న విషయంపై విచారణ జరుపుతున్నామని ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సమీర్ టాండన్ చెప్పడం గమనార్హం. ఈ ఘటనకు కారకులు ఎవరన్నది దర్యాప్తు చేస్తామన్న ఆయన.. రోగి కుటుంబ సభ్యులు సైతం ఐసీయూలో ఉన్నారని.. వారు కూడా ఈ ఘటనకు బాధ్యులేనని వితండ వాదన చేశారు. వార్డు ఇంఛార్జి నుంచి నివేదిక కోరామని.. దాని ప్రకారం విచారణ జరుపుతామని చెప్పుకొచ్చారు.

ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇతర రోగుల బంధువులు సైతం ఈ విషయంపై ఫిర్యాదులు చేశారు. ఐసీయూలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పారు. పెద్ద సంఖ్యలో ఎలుకలు తిరుగుతున్నాయని తెలిపారు. అయితే, ఆస్పత్రిలో క్రిమిసంహారకాలు ఎప్పటికప్పుడు జల్లుతున్నామని సూపరింటెండెంట్ డా. నవీన్ సక్సేనా పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

పెంపుడు శునకంపై చిరుత దాడి.. కాపాడేందుకు యజమాని సాహసం

చేయని నేరానికి 12 ఏళ్లుగా జైల్లో.. నిర్దోషిగా తేల్చిన కోర్టు

ABOUT THE AUTHOR

...view details