తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇల్లు తగలబెట్టి  రూ.2లక్షలు బూడిద చేసిన ఎలుక - వ్యాపారవేత్త వినోద్‌భాయ్

Rat absconded by burning: గుజరాత్​లో ఓ ఎలుక చేసిన పనికి ఇల్లు కాలిపోయింది. రూ. 2 లక్షల నగదు దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలుక చేసిన ఆ పనేంటో ఓ లుక్​ వేద్దామా మరి..

Rat absconded by burning
ఇల్లును కాల్చిన ఎలుక

By

Published : Apr 6, 2022, 8:46 PM IST

Rat absconded by burning: చైత్ర నవరాత్రుల సందర్భంగా గుజరాత్​ వ్యాపారవేత్త వినోద్‌భాయ్ తన ఇంట్లో దీపం వెలిగించాడు. ఆ తర్వాత మండుతున్న దీపాన్ని ఎలుక ఈడ్చుకెళ్లి బట్టలలో పడేసింది. దీంతో ఇళ్లంతా మంటల్లో చిక్కుకుని కాలిపోయింది. ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు అగ్నిని ఆహుతైంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఆ ఘటన గుజరాత్​లోని ఏఎమ్​టిఎస్​ బస్​ స్టేషన్ వెనుక కర్మభూమి సోసైటీలో బుధవారం ఉదయం జరిగింది. మొదట స్థానికులు పైపుల ద్వారా నీటి మోటర్‌ను పెట్టి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details