తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అరుదైన రెండు తలల కోబ్రాను చూశారా?

రెండు తలల కోబ్రా ఒకటి మొదటిసారిగా ఉత్తరాఖండ్‌లో కనిపించింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అది ఉన్న చోటుకు చేరుకుని సంరక్షించింది.

రెండు తలల కోబ్రా
రెండు తలల కోబ్రా

By

Published : Aug 15, 2021, 8:51 PM IST

Updated : Aug 15, 2021, 11:02 PM IST

రెండు తలల కోబ్రా

ఉత్తరాఖండ్‌లో రెండు తలల కోబ్రా లభ్యమైంది. వికాస్‌నగర్​‌లోని ఓ ఫ్యాక్టరీ ఆవరణలో ఇది కనిపించింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ ఘటనా స్థలానికి చేరుకుని సంరక్షించింది. ఒకటిన్నర అడుగుల పొడవున్న ఈ పాము వయస్సు రెండు వారాల కంటే తక్కువే ఉంటుందని అటవీ ఉద్యోగి ఆదిల్ మీర్జా తెలిపాడు. అతను గత 15 ఏళ్లుగా పాములను సంరక్షిస్తున్నాడు.

ఈ పాము జన్యుపరమైన కారణాలతో బాధపడుతోందా? అడవిలో జీవించగలదా? లేదా? అని అధ్యయనం చేయనున్నట్లు డీఎఫ్​ఓ బీబీ మార్టోలియా చెప్పారు. ఇక ఈ పాముల జీవిత కాలం చాలా తక్కువని.. వివిధ కారణాల వల్ల ఇవి ఎక్కువగా అక్రమ రవాణాకు గురవుతుంటాయని దెహ్రాదూన్ పశువైద్యాధికారులు తెలిపారు.

రెండు తలల కోబ్రా
రెండు తలల కోబ్రా

"ఈ పాములను తాంత్రికపూజల్లో అధికంగా వినియోగిస్తున్నారు. అలాగే ఈ పాములను తింటే లైంగిక శక్తి పెరుగుతుందని కూడా కొందరు నమ్ముతుంటారు. అంతేగాక ఎయిడ్స్ వంటి ప్రమాదకరమైన వ్యాధికి చికిత్సలోనూ ఉపయోగిస్తారని విశ్వసిస్తారు. అయితే దీని వెనుక ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పురాణాల్లోని ఈ నమ్మకాల ఆధారంగానే.. ఇవి పెద్దఎత్తున అక్రమంగా రవాణాకు గురవుతాయి."

-దెహ్రాదూన్ పశువైద్యశాల

దేశంలోని అనేక చోట్ల రెండు తలల పాముల అక్రమంగా రవాణా అవుతున్నాయి. ప్రధానంగా బిహార్, బంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తర్​ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో పెద్దఎత్తున జరుగుతోంది.

ఇవీ చదవండి:

Last Updated : Aug 15, 2021, 11:02 PM IST

ABOUT THE AUTHOR

...view details