Rare Surgery in Kerala: ఛాతీ భాగంలో అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ చిన్నారిని రక్షించారు వైద్యులు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకులంలో జరిగింది.
కొట్టాయంకు చెందిన ఫేబిన్-జెస్టీ దంపతులకు ఏడాదిన్నర శిశువు ఉంది. చిన్నారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుండగా.. ఆస్పత్రిలో చేర్చారు తల్లిదండ్రులు. పరీక్షల అనంతరం పాప ఛాతీ భాగంలో.. ఆహార నాళంలో ఉత్పత్తి అయ్యే శోషరస ద్రవం ఛాతీలోకి లీక్ అవుతున్నట్లు గుర్తించారు డాక్టర్లు. అరుదైన శస్త్రచికిత్సతో (ఎంబోలైజేషన్) ఆ లీక్‌ను మూసివేసి చిన్నారిని కాపాడారు.