తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాముకు అరుదైన సర్జరీ.. చర్మానికి కుట్లు వేసిన వైద్యులు - నాగు పాముకు ఆపరేషన్

Snake Surgery in Karnataka: కర్ణాటకలో ఓ పాముకు అరుదైన శస్త్రచికిత్స చేశారు. పొలం దున్నుతుండగా నాగలి కింద పడి గాయపడ్డ పాముకు.. కుట్లు వేసి వైద్యులు చికిత్స అందించారు.

Snake Surgery in Karnataka
Snake Surgery in Karnataka

By

Published : Mar 3, 2022, 8:37 PM IST

Snake Surgery in Karnataka: ప్రమాదానికి గురైన నాగుపామును సర్జరీ చేసి కాపాడిన ఘటన.. కర్ణాటక చామరాజనగర్‌లో జరిగింది. ఐదు రోజుల క్రితం సోమవరపేటలోని పంట పొలాన్ని దున్నుతుండగా.. ఓ పాము నాగలి కింద పడి తీవ్రంగా గాయపడింది. దీంతో సర్పాల ప్రేమికుడైన అశోక్‌ అనే వ్యక్తి గాయపడ్డ పామును స్థానిక పశువైద్యశాలకు తీసుకెళ్లాడు.

పాముకు శస్త్రచికిత్స చేస్తున్న వైద్యుడు

పాము చర్మం రెండు చోట్ల చీలి పోయినట్లు వైద్యుడు గుర్తించారు. వాటికి కుట్లు వేసి చికిత్స అందించారు. 3 రోజుల విశ్రాంతి అనంతరం పామును సమీపంలోని కొండ ప్రాంతంలో విడిచిపెట్టారు.

పాము చర్మానికి కుట్లు వేసిన తర్వాత...

ఇదీ చదవండి:చెన్నై మేయర్​గా ఎస్సీ మహిళ... 340ఏళ్ల చరిత్రలో తొలిసారి..

ABOUT THE AUTHOR

...view details