తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూడు కళ్ల 'వింత దూడ'.. పాపం వారం రోజులకే...

Rare calf died: మూడు కళ్లు, ముక్కులో నాలుగు రంధ్రాలతో జన్మించిన వింత దూడ వారం రోజులకే మృతి చెందింది. దూడ అంత్యక్రియల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గ్రామస్థులు. ఈ సంఘటన ఛత్తీస్​గఢ్​ రాజ్​నందగావ్​ జిల్లాలో జరిగింది.

Three-eyed calf dies
మూడు కళ్లతో జన్మించిన వింత దూడ

By

Published : Jan 20, 2022, 4:26 PM IST

Updated : Jan 20, 2022, 5:46 PM IST

మూడు కళ్లతో పుట్టిన వింత దూడ మృతి

Rare calf died: ఛత్తీస్​గఢ్​ రాజ్​నందగావ్​ జిల్లాలో మూడు కళ్లు, ముక్కులో నాలుగు రంధ్రాలతో పుట్టిన వింత ఆవుదూడ.. వారం రోజులకే మృతి చెందింది. గురువారం ఉదయం దూడ మరణించినట్లు రైతు తెలిపారు.

జిల్లాలోని నవగావూన్​ లోధి గ్రామానికి చెందిన రైతు హేమంత్​ చండేల్​కు చెందిన జెర్సీ ఆవుకు జనవరి 13న ఈ వింత ఆడ దూడ జన్మించింది. సంక్రాంతి ముందు జన్మించడం వల్ల శివుడిగా భావించారు. దానిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు రైతు ఇంటికి తరలివచ్చారు. కొందరు దేవుడి ప్రతిరూపంగా భావిస్తూ పూజలు చేశారు.

వింత ఆవు దూడ మరణించినట్లు తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో.. చండేల్​ ఇంటికి చేరుకుని అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

"గురువారం ఉదయం 9 గంటలకు దూడ మరణించింది. గౌథాన్​లో అంత్యక్రియలు నిర్వహించాం. ప్రస్తుతం నా పరిస్థితిని చెప్పలేకపోతున్నా. దేవుడు మా ఇంటికి వచ్చి వెళ్లాడని భావిస్తున్నాం."

- హేమంత్​ చండేల్​, రైతు

పిండం సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇలా జరుగుతుందని స్థానిక పశువైద్యుడు డాక్టర్​ సందీప్​ ఇదుర్కర్​ తెలిపారు. సాధారణంగా అలాంటి దూడలు చాలా బలహీనంగా ఉంటాయని, ఎక్కువ రోజులు జీవించలేవన్నారు. ఈ దూడ సైతం ఎక్కువ రోజులు జీవించలేదని ముందుగానే ఊహించామని చెప్పారు. ఇలాంటి వాటిని దేవుడికి ఆపాదించకూడదని ప్రజలకు సూచించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:టీకా వద్దంటూ సిబ్బందిపై దాడి.. మరొకరు చెట్టెక్కి..

Last Updated : Jan 20, 2022, 5:46 PM IST

ABOUT THE AUTHOR

...view details