Rape Victim News: రాజస్థాన్లో ఘోరం జరిగింది. మైనర్పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఆటో డ్రైవర్.
ఝాలావాఢ్ జిల్లాలోని డాడ్వాడా ప్రాంతంలో బాలిక నివసిస్తోంది. అదే బిల్డింగ్లో నివసిస్తున్నాడు నిందితుడు. సరకులు కొనడానికి బయటికి వెళ్లినప్పుడు బాలికను అనుసరించాడు ఆ ఆటో డ్రైవర్. మాయ మాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకున్నాడు. ఓ నిర్మాణ దశలో ఉన్న భవనం దగ్గరికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు.
యూపీలో ఘోరం..
Muzaffarnagar Rape Case:ఉత్తర్ప్రదేశ్ ముజఫర్ నగర్లో మైనర్పై (15) స్థానిక యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను ఇంటికి తీసుకెళ్లి ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.