తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాలుగేళ్ల చిన్నారిపై యువకుడి అత్యాచారం - నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

Rape Victim: మధ్యప్రదేశ్​లోని రేవా జిల్లాలో దారుణ జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.

a
మధ్యప్రదేశ్​

By

Published : Dec 13, 2021, 3:50 PM IST

Rape Victim: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఇంటిబయట ఆడుకుంటున్న ఆ చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని రేవా జిల్లాలో జరిగింది.

బాధితురాలు ఇంటి సమీపంలో నివసించే యువకుడు.. ఆదివారం సాయంత్రం చిన్నారి ఆడుకుంటుండగా ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. నిందితుడి ఇంటిని నుంచి బయటకు వచ్చిన చిన్నారి.. తల్లిదండ్రులతో ఈ విషయం చెప్పింది. దీంతో తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడు పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

చికిత్స నిమిత్తం బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాలిక ఆరోగ్యంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

ఇదీ చూడండి :బార్​లో రహస్య గది.. అద్దం పగలగొడితే 17మంది అమ్మాయిలు

ABOUT THE AUTHOR

...view details