Rape Victim: ఎనిమిదేళ్ల చిన్నారిని ఓ యువకుడు అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారై.. మరో అత్యాచారానికి పాల్పడేందుకు బాలికను వెతుకుతున్నాడు. అదే సమయంలో నిందితుడి సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన దిల్లీ శివార్లలో జరిగింది.
ఇదీ జరిగింది..
అలీపుర్ ప్రాంతానికి చెందిన బాధితురాలు ఆదివారం సాయంత్రం స్థానిక ఆలయం వెళ్లి బయటకువస్తోంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన నిందితుడు సమీర్.. ఇంటి దగ్గర దిగబెడతానని చెప్పి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. తన తండ్రికి నిందితుడితో పరిచయం ఉండటం వల్ల ఆమె అతడి వెంటవెళ్లింది. బాధితురాలిని ఓ అడవి ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.
చిన్నారి కనిపించకపోవడంపై సమాచారం అందుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. సమీర్‌ను అరెస్ట్ చేసే సమయంలో అతను అశ్లీల చిత్రాలు చూస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలో మరో అత్యాచారానికి పాల్పడేందుకు నిందితుడు బాలిక కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సమీర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి :డ్రైనేజీలో అపస్మారక స్థితిలో మందుబాబు.. తీరా లేపి చూస్తే..!