ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఇటీవలే అత్యాచారానికి గురైన ఓ బాధితురాలు.. జిల్లా ఎస్పీ కార్యాలయంలో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే బాధితురాలిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్టు చేయకపోవడం వల్లే బాధితురాలు.. ఇలా చేసినట్లు తెలుస్తుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు షాహిద్‌పై కేసు నమోదు చేశారు. కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఈ కేసులో బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్యాచారం కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ దినేష్ తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామన్నారు.
పెళ్లి పేరుతో పోలీస్ అత్యాచారం..పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఓ మహిళ పై అత్యాచారం చేశాడు పోలీస్. ఆ తర్వాత ఎన్ని రోజులైనా పెళ్లిపై అతడు నోరు విప్పకపోవడం వల్ల బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది.
పోలీసులు వివరాలు ప్రకారం..మూడేళ్ల క్రితం బాధితురాలు తన భర్తపై ఫిర్యాదు చేయడానికి ఓ సారి పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. ఆ సమయంలో నిందితుడికి, బాధితురాలికి పరిచయం ఏర్పిడింది. అప్పటి నుంచి వీరిద్దరు స్థానిక లాడ్జిలో ఉంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు. అలా కొన్ని నెలలు జరిగినా.. అతడు పెళ్లి విషయంపై స్పందించకపోవడం వల్ల ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.