Rape in Dabhra of Janjgir Champa: ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్ చంపా జిల్లాలో నిర్భయ తరహా ఘటన కలకలం రేపింది. ఓ మానసిక దివ్యాంగురాలుపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. అనంతరం బాధితురాలి జననాంగాలలో ఇనుపరాడ్‌ను దూర్చి హింసించాడు. దీంతో ఆ మహిళ తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఏప్రిల్ 5వ తేదీన బాధిత మహిళ రోడ్డు పక్కన ప్రమాదకర స్థితిలో స్థానికులకు కనిపించింది. ఆమె శరీరం అంతటా గాయాలు ఉన్నాయి. బాధితురాలిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం.. ఆపై ఇనుప రాడ్‌తో - chattisgarh rape
Rape in Dabhra of Janjgir Champa: 2012లో దేశవ్యాప్తంగా సంచలనమైన నిర్భయ అత్యాచార ఘటన తరహాలోనే ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో మరో దారుణం జరిగింది. ఓ మహిళపై అత్యాచారం చేసి ఆమె జననాంగాలలో ఇనుప రాడ్‌ను దూర్చి హత్య చేశాడు ఓ కిరాతకుడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తొలుత ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా భావించారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీను పోలీసులు పరిశీలించగా.. ఓ యువకుడు మహిళను ఈడ్చుకెళ్లడం కనిపించింది. పోస్టుమార్టం నివేదికలోనూ అత్యాచారం చేసి ఆ తరువాత మర్డర్ చేసినట్లు తేలింది. నిందితుడు దబ్రా ప్రాంతానికి చెందిన కిషన్ యాదవ్‌గా గుర్తించారు. ఏప్రిల్ 9వ తేదీన కిషన్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసుల విచారణలో నిందితుడు కిషన్ ఆ రాత్రి సమయంలో మహిళ ఒంటరిగా ఉండటం చూసి ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు తెలిపాడు. మహిళపై అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత బాధితురాలు కేకలు వేస్తూ అతన్ని నెట్టుకెళ్లిందని తెలిపాడు. దీంతో బాధితురాలి జననాంగాలలో ఇనుప రాడ్‌ను చొప్పించినట్లు తెలిపాడు. తీవ్రంగా కొట్టడం వల్ల మహిళ అక్కడికక్కడే మహిళ ప్రాణాలు కోల్పోయిందని పోలీసుల విచారణలో తేలింది.
ఇదీ చదవండి:కేంద్ర మంత్రికి ధరల సెగ- విమానంలోనే వాడీవేడిగా..!