తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కిడ్నాప్​ చేసి రేప్​​ చేశాడని బాలిక​ ఫిర్యాదు.. నిందితుడు 'అతడు' కాదు 'ఆమె'.. పోలీసులు షాక్​! - సిరోహి వార్తలు

తనను ఓ యువకుడు కిడ్నాప్​ చేసి రెండు రోజుల పాటు అత్యాచారం చేశాడని ఓ బాలిక పోలీసులకు​ ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తాను కిడ్నాప్​ చేయడం నిజమేనని కానీ అత్యాచారం చేయలేదని అతడు చెప్పాడు. ఆ తర్వాత నిందితుడు అబ్బాయి కాదు, అమ్మాయి అని తేలింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాకై ఏం చేశారంటే?

rape-accused-turn-out-to-be-woman
rape-accused-turn-out-to-be-woman

By

Published : Dec 17, 2022, 10:42 PM IST

రాజస్థాన్​లో షాకింగ్​ కేసు వెలుగులోకి వచ్చింది. తనను ఓ యువకుడు కిడ్నాప్​ చేసి రెండు రోజుల పాటు అత్యాచారం చేశాడని ఓ మైనర్.. పోలీసులకు​ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో భాగంగా ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తాను కిడ్నాప్​ చేయడం నిజమేనని.. కానీ, అత్యాచారం చేయలేదని అతడు విచారణలో చెప్పాడు. ఆ తర్వాత తాను అబ్బాయిని కానని.. మూడేళ్ల పాపకు తల్లినని తెలిపాడు. అది విన్న పోలీసులు షాకయ్యారు.

స్టేషన్​ ఆఫీసర్​ మాయా పండిట్​ వివరాల ప్రకారం..
గత నెల 28 తేదీన తనను కిడ్నాప్​ చేసి రెండు రోజుల పాటు అత్యాచారం చేశాడని యువకుడిపై సిరోహికి చెందిన ఓ బాలిక ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆటోలో తీసుకెళ్లి శివగంజ్​ ప్రాంతంలో వదిలేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో.. కిడ్నాప్​ చేసిన యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఓ క్యాటరింగ్​లో పనిచేస్తున్న యువకుడిని పట్టుకుని స్టేషన్​కు తీసుకొచ్చారు. ఇక్కడే అసలు ట్విస్ట్​ మొదలైంది.

పోలీస్​స్టేషన్​కు వచ్చాక విచారణలో తాను బాలికను ఎత్తుకెళ్లానని, కానీ ఎటువంటి లైంగిక చర్యలకు పాల్పడలేదని చెప్పాడు. ఎందుకంటే తాను అబ్బాయిని కానని.. అమ్మాయినని తెలిపాడు. ఇది విన్న పోలీసులు షాకయ్యారు. వెంటనే స్థానికంగా విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ ఆఫీసర్​కు లేఖ రాశారు. వచ్చి మెడికల్​ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఒక గైనికాలజిస్ట్​ సహా నలుగురు డాక్టర్లు.. నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుడు అబ్బాయి కాదని, మహిళ అని వైద్యులు నిర్ధరించారు. అంతే కాదు ఆమె మూడేళ్ల క్రితం ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత ఇది కిడ్నాప్​ కేసు మాత్రమేనని, అత్యాచారం కేసు కాదని పోలీసులు తేల్చారు. మెడికల్ బోర్డు పరీక్షల అనంతరం నిందితుడిని సంబంధిత కోర్టులో హాజరుపరిచి కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

నిందితుడు (నిందితురాలు)

అయితే, తన జీవిత కథను నిందితురాలు(నిందితుడు) పోలీస్​స్టేషన్​లో తెలిపింది. 'నాకు ఊహ తెలియకముందే తల్లిదండ్రులు చనిపోయారు. పెంచి పెద్ద చేసిన సోదరుడు.. నేను పెద్దయ్యాక వేరేవాళ్లకు విక్రయించాడు. వారు నాకు కొన్నాళ్ల క్రితం వివాహం చేశారు. పెళ్లైన కొన్ని నెలలకే నాకు పండంటి మగబిడ్డ పుట్టాడు. కొన్ని కారణాల వల్ల నన్ను నా భర్త వదిలేశాడు. తీవ్ర మనస్తాపానికి గురైన నేను.. జట్టు కత్తిరించుకుని ప్యాంట్​ షర్ట్​ వేసుకుని అబ్బాయిలా జీవించడం మొదలుపెట్టా. వివిధ హోటళ్లలో పనిచేశా. పెళ్లిళ్లకు క్యాటరింగ్​ బాయ్​లా వెళ్లి డబ్బులు సంపాదించా. అలా వివిధ రకాల పనులు చేస్తూ కడుపు నింపుకొనేదాన్ని. పనిచేసే చోట్ల.. ఒక్కొక్కరికి ఒక్కో పేరు చెప్పేదాన్ని' అని నిందితురాలు వివరించింది. ఈ క్రమంలోనే కిడ్నాప్​ కేసులో అరెస్ట్​ అయ్యి కస్టడీలో ఉన్నట్లు తెలిపింది..

ABOUT THE AUTHOR

...view details