తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని తాను పెళ్లి చేసుకున్నానని, తమకు సంతానం కూడా ఉన్నారని.. అందువల్ల నిందితునిపై నమోదైన కేసును కొట్టివేయాలన్న ఓ మహిళ అభ్యర్థనను(Rape survivor plea) కర్ణాటక హైకోర్టు(Karnataka high court) తోసిపుచ్చింది. నేర స్వభావం, తీవ్రత, సమాజంపై ప్రభావం కారణంగా తాము ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు చెప్పింది.
విజయపురి జిల్లా బాసవానా బాగెవాడీలోని ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతున్న ఈ అత్యాచార కేసును కొట్టేయాలని బాధితురాలు, నిందితుడు(Victim accused couple) కర్ణాటక హైకోర్టుకు చెందిన కలబురిగి బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ కేసులో నిందితుడిపై న్యాయ విచారణ కొనసాగితే కలిగే ప్రయోజనం ఏమీ లేదని బాధితురాలు తన పిటిషన్లో పేర్కొంది. తనపై అత్యాచారం జరిగిన సమయంలో తన వయసు 19 ఏళ్లు అని చెప్పింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ హెచ్.పి.సందేశ్ ధర్మాసనం.. బాధితురాలి అభ్యర్థనను తిరస్కరిస్తన్నట్లు చెప్పింది.