తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హత్య కేసులో డేరా బాబాకు జీవిత ఖైదు

ఓ హత్య కేసులో దోషిగా తేలిన డేరా సచ్ఛా సౌధ చీఫ్​ డేరా బాబా(dera baba news) అలియాస్​.. గుర్మీత్​ రామ్​ రహీమ్​ సింగ్​కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది హరియాణాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు. ఆయనతో పాటు మరో నలుగురు దోషులకు సైతం శిక్ష ఖరారు చేసింది.

gurmeet-ram-rahim
హత్య కేసులో డేరా బాబాకు జీవిత ఖైదు

By

Published : Oct 18, 2021, 4:57 PM IST

డేరా సచ్ఛా సౌధ చీఫ్(dera sacha sauda)​ డేరా బాబా(dera baba news) అలియాస్​ గుర్మీత్​ రామ్​ రహీమ్​ సింగ్​కు ఓ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. డేరా బాబాను ఇటీవలే దోషిగా తేల్చిన హరియాణా, పంచకులలోని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రత్యేక కోర్టు ఈమేరకు శిక్ష ఖరారు చేసింది. ఆయనతో పాటు మరో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. అలాగే.. డేరా బాబాకు(dera baba news) రూ.31 లక్షలు, మిగతా వారికి రూ.50 వేల చొప్పున జరిమానా విధించింది.

రంజిత్​ సింగ్​ హత్య కేసులో విచారణ చేపట్టిన కోర్టు.. వారిని దోషులుగా తేల్చుతూ అక్టోబర్​ 8న తీర్పు వెలువరించింది. రామ్​ రహీమ్​ సింగ్​తో పాటు క్రిష్ణలాల్​, జస్వీర్​, సబ్దిల్​, అవతార్​ దోషులుగా తేలారు. ప్రస్తుతం డేరా బాబా సునారియా జైలులో ఉన్నారు. నిందితుల్లో ఒకరు ఇప్పటికే మరణించారు.

2002లో రంజిత్​ సింగ్​ హత్యకు గురయ్యాడు. ఈ కేసును 2003లో సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. జర్నలిస్ట్​ రామచంద్ర ఛత్రపతి హత్య సహా మహిళా అనుచరులపై అత్యాచారం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు డేరా బాబా.

ABOUT THE AUTHOR

...view details