తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హత్య కేసులో డేరా బాబాను దోషిగా తేల్చిన కోర్టు - డేరా బాబా వార్తలు

ఓ హత్య కేసులో డేరా బాబాతో(dera baba news) పాటు మరో నలుగురిని దోషులుగా తేల్చింది హరియాణాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు. అక్టోబర్​ 12న శిక్ష ఖరారు చేయనున్నట్లు వెల్లడించింది.

Ram Rahim
డేరా బాబాను దోషిగా తేల్చిన కోర్టు

By

Published : Oct 8, 2021, 11:51 AM IST

Updated : Oct 8, 2021, 11:59 AM IST

డేరా సచ్చా సౌధ(dera sacha sauda) చీఫ్ డేరా బాబా అలియాస్​..​ గుర్మీత్​ రామ్​ రహీమ్​ సింగ్​ను(dera baba news) ఓ హత్య కేసులో దోషిగా తేల్చింది హరియాణాలోని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ప్రత్యేక కోర్టు. ఆయనతో పాటు మరో నలుగురు నేరానికి పాల్పడినట్లు తేల్చింది.

రంజిత్​ సింగ్​ హత్య కేసులో విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. రామ్​ రహీమ్​ సింగ్​తో పాటు క్రిష్ణలాల్​, జస్వీర్​, సబ్దిల్​, అవతార్​లు దోషులుగా తేలారు. ప్రస్తుతం డేరా బాబా సునారియా జైలులో ఉన్నారు. నిందితుల్లో ఒకరు ఇప్పటికే మరణించారు.

దోషులకు అక్టోబర్​ 12న శిక్ష ఖరారు చేయనుంది సీబీఐ ప్రత్యేక కోర్టు.

2002లో రంజిత్​ సింగ్​ హత్యకు గురయ్యాడు. ఈ కేసును 2003లో సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. జర్నలిస్ట్​ రామచంద్ర ఛత్రపతి హత్య సహా మహిళా అనుచరులపై అత్యాచారం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు డేరా బాబా.

Last Updated : Oct 8, 2021, 11:59 AM IST

ABOUT THE AUTHOR

...view details