తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నడిరోడ్డుపై నటి దారుణ హత్య.. చోరీ కోసం వచ్చి కాల్చి చంపిన దొంగలు - Ranchi singer Isha shot dead by thugs

ఝార్ఖండ్​కు​ చెందిన ఓ నటిని దుండగులు కాల్చి చంపారు. బంగాల్​లోని ఓ హైవేపై భర్త ముందే ఆమెను హత్య చేశారు. దోపిడీ చేసేందుకు వచ్చిన దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. బుధవారం ఘటన జరిగింది.

Ranchi singer Isha Alia murdered in Kolkata
రాంచి సింగర్​ ఇషా హత్య

By

Published : Dec 28, 2022, 10:02 PM IST

ఝార్ఖండ్​కు​ చెందిన ఓ నటిని కాల్చి చంపారు కొందరు దుండగులు. బంగాల్​లోని ఓ హైవేపై ఈ దారుణం జరిగింది. చోరీ చేసేందుకు వచ్చిన దుండగులు భర్త ముందే ఆమెను కాల్చి చంపారు. బుధవారం హౌరా జిల్లా, మహిశ్రేఖలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు రియా కుమారి అలియాస్​ ఇషా అలియా ఒక నటి, యూట్యూబర్​. బుధవారం తన భర్త ప్రకాశ్​ కుమార్​, రెండేళ్ల కూతురితో కలిసి 16వ జాతీయ రహదారిపై.. కారులో కోల్​కతాకు వెళ్తున్నారు. బగ్నాన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో.. దాదాపు 6 గంటల సమయంలో విశ్రాంతి కోసం కుమార్​ కారును ఆపాడు. అపుుడే ముగ్గురు దుండగులు వీరిపై దాడి చేశారు. అనంతరం కుమార్​ నుంచి సొమ్మును లాక్కునేందుకు ప్రయత్నించారు. అప్పుడు రియా.. భర్తను కాపాడేందుకు వారిని అడ్డుకుంది. దీంతో ఆ దుండగులు ఆమెను కాల్చారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

ఇషా

ఘటన తరువాత కుమార్​ తన భార్యను తీసుకుని సాయం కోసం కారులో మూడు కిలోమీటర్లు ప్రయాణించాడు. అనంతరం హైవేవై కొంత మంది స్థానికులు కనిపించారు. వారి సాయంతో భార్యను ఉలుబెరియాలోని ఎస్​ఎస్​సీ మెడికల్ కాలేజ్ అండ్​ హాస్పిటల్ తరలించాడు కుమార్​. కాగా అప్పటికే ఆమె చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధరించారు.

"వారు మాతో బెంగాలి భాషలో మాట్లాడారు. వారు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కాలేదు. మాకు శత్రువులు ఎవ్వరూ లేరు. వారు మాపై ఎందుకు దాడి చేశారో తెలియదు. తొలుత వారిని మాలాంటి టూరిస్టులే అనుకున్నాం."
-మృతురాలి భర్త ప్రకాశ్​ కుమార్

"ఘటనపై కేసు నమోదు చేశాం. విచారణ సైతం జరుపుతున్నాం. బాధితురాలి భర్తను కూడా విచారిస్తున్నాం. కుమార్​కు సాయం చేసిన స్థానికులను విచారిస్తాం" అని పోలీసులు తెలిపారు. కారును సీజ్​ చేసి ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపినట్లు వారు వెల్లడించారు.

ఇషా

నటి రియా గత 10 సంవత్సరాలుగా నాగ్‌పురి, భోజ్‌పురి చిత్రాలలో నటిస్తున్నారు. ఆమెకు సంబంధించిన చాలా ఆల్బమ్‌లు నాగ్​పురి భాషలో భారీ విజయాలు సాధించాయి. అలియా జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లా వాసి. ప్రస్తుతం ఆమె రాంచీలోని బరియాతు టాగోర్ హిల్‌లో ఉన్న తారామణి అపార్ట్‌మెంట్‌లోని ఉంటున్నారు.
రియాకు కొత్త చిత్రం కోసం ఆఫర్ వచ్చింది. ఆ చిత్ర నిర్మాతలు కోల్‌కతాకు చెందినవారు. అందుకే ఆమె భర్త, కుమార్తెతో కలిసి సినిమా కోసం దుస్తులు కొనడానికి కోల్‌కతాకు వెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details