తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జర్నలిస్ట్ రానా ఆయుబ్​పై ఈడీ కొరడా.. భారీగా నిధులు సీజ్ - rana ayyub news

Rana Ayyub ED: మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా పాత్రికేయురాలు రానా ఆయుబ్ బ్యాంకు బ్యాలెన్స్, ఫిక్స్​డ్ డిపాజిట్లను ఈడీ అటాచ్ చేసింది. 2021 సెప్టెంబర్​లో నమోదైన కేసుకు సంబంధించి ఈ మేరకు చర్యలు తీసుకుంది.

RANA AYYUB ED
RANA AYYUB ED

By

Published : Feb 10, 2022, 10:51 PM IST

Rana Ayyub ED: ప్రముఖ జర్నలిస్ట్ రానా ఆయుబ్​పై ఈడీ కొరడా ప్రయోగించింది. మనీలాండరింగ్ కేసులో రూ.1.77 కోట్లను అటాచ్ చేసింది. దాతలు ఇచ్చే నిధులను వ్యక్తిగత అవసరాల కోసం మళ్లించారన్న కేసు దర్యాప్తులో భాగంగా నగదును సీజ్ చేసింది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈ మేరకు ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. రానాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న ఫిక్స్​డ్ డిపాజిట్లు, బ్యాంకు బ్యాలెన్స్​ను అటాచ్ చేసినట్లు తెలిపింది.

2021 సెప్టెంబర్​లో రానా ఆయుబ్​పై ఈ కేసు నమోదైంది. స్వచ్ఛంద సేవ కోసం సమీకరించిన నిధులను ఆమె వినియోగించుకున్నారని ఉత్తర్​ప్రదేశ్ గాజియాబాద్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:'నెహ్రూ వైఫల్యం వల్లే గోవాకు ఆలస్యంగా స్వాతంత్ర్యం'

ABOUT THE AUTHOR

...view details