Joint Commissioner night patrol: చెన్నై మహిళా ఐపీఎస్ అధికారి తెగువ చూపిస్తున్నారు. అర్ధరాత్రి తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలో సైకిల్‌పై ఒంటరిగానే గస్తీ తిరుగుతున్నారు. రాత్రిపూట డ్యూటీలో ఉన్న గార్డ్లను పర్యవేక్షిస్తున్నారు. కొంతకాలంగా ప్రతి రాత్రి 2.30 నుంచి ఉదయం 4.30 వరకు సైక్లింగ్ చేస్తూ పలువురు అనుమానితుల్ని ప్రశ్నించారు. ఏ సమయంలోనైనా ప్రజలకు సేవ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారనే సందేశాన్ని ఇస్తున్నారు.
Chennai police patrol cycle: చెన్నై నార్త్ జోన్లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న రమ్య భారతి కొద్ది రోజులుగా సైకిల్‌పై రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మార్చి 26న రోడ్లపై సైక్లింగ్ నిర్వహించిన రమ్య భారతి.. ఎన్ఎస్సీ బోస్ రోడ్, మింట్ జంక్షన్, ఎన్నూర్ హైరోడ్ ప్రాంతాల్లో మొత్తం తొమ్మిది కిలోమీటర్లు పెట్రోలింగ్ చేశారు. రాత్రి అధికంగా నేరాలు జరిగే సమయంలోనే ఈమె సైక్లింగ్ చేస్తున్నారు. నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలకు భద్రత కల్పించడమే తమ ధ్యేయమని తెలిపారు. రమ్య భారతి తెగువను సీఎం స్టాలిన్ కూడా మెచ్చుకున్నారు.