కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామమందిర నిర్మాణాన్ని అడ్డుపెట్టుకుని చాలామంది రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. విరాళాలను పారదర్శకంగా సేకరించాలని డిమాండ్ చేశారు. 'రామ మందిర నిధి సమర్పణ్ అభియాన్'పై తాను గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.
నాజీతో పోలిక..
మందిర నిర్మాణానికి విరాళాలివ్వని ఇళ్లకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గుర్తులు పెడుతున్నారని కుమారస్వామి ఆరోపించారు. వారిని నాజీలతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. మందిర నిర్మాణానికి అనధికార వ్యక్తులు విరాళాలు వసూలు చేయడమేంటని కుమారస్వామి ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు 'నాజీ' విధానాలను పోలి ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.