తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్రావెల్ ట్రేడ్​ షోలో ఆకట్టుకుంటున్న 'రామోజీ ఫిల్మ్ సిటీ' స్టాల్​.. వినోదానికి కేరాఫ్ అడ్రస్​గా.. - ముంబయి ఎగ్జిబిషన్​లో రామోజీ ఫిల్మ్ సిటీ

ముంబయిలో జరగుతున్న ఓటీఎమ్​ ట్రేడ్​ షోలో రామోజీ ఫిల్మ్ సిటీ స్టాల్​ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు, టూరిస్టులు రామోజీ ఫిల్మ్ సిటీ గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇంకా ఏమన్నారంటే?

Ramoji Film City Mumbai Stall
Ramoji Film City

By

Published : Feb 2, 2023, 10:15 PM IST

Updated : Feb 2, 2023, 10:24 PM IST

మహారాష్ట్రలోని ముంబయిలోని జియో వరల్డ్​ కన్వెన్షన్​ సెంటర్​లో జరుగుతున్న ఓటీఎమ్​ ట్రావెల్ ట్రేడ్​ షోలో రామోజీ ఫిల్మ్ సిటీ స్టాల్​.. సెంటర్​ ఆఫ్​ అట్రాక్షన్​గా నిలుస్తోంది. ఈ ప్రదర్శనలో హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్ సిటీ స్టాల్​ సందర్శకుల దృష్టిని కట్టిపడేసింది. కాగా, ఈ ట్రావెల్​ ఎగ్జిబిషన్​లో వివిధ రాష్ట్రాలకు చెందిన బ్రాండ్​లు, 50 అంతర్జాతీయ టూరిస్ట్ బ్రాండ్​లు పాల్గొన్నాయి. ఈ ప్రదర్శనకు వచ్చిన చాలా మంది ఔత్సాహికులు, టూరిస్టులు.. అన్ని రకాల వినోదాలకు రామోజీ ఫిల్మ్ సిటీ అడ్డాగా మారిందని అభిప్రాయపడుతున్నారు.

"ముంబయి ఓటీఎమ్​లో మా స్టాల్​కు అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తున్నాం. ఫిల్మ్‌సిటీ గురించి టూరిస్టులు అడిగే సందేహాలన్ని క్లుప్తంగా వివరించి చెబుతున్నాం. వినోదం గురించిన సమాచారమే కాకుండా స్కూల్, కాలేజ్, సమ్మర్ క్యాంప్​ వంటి వివిధ ప్యాకేజీల గురించి కూడా టూరిస్ట్​లకు సమాచారం ఇస్తున్నాము. టూరిస్టులకు కావాల్సన బడ్జెట్‌లోనే వారికి అందుబాటులో ఉన్న ప్యాకేజీల గురించి వివరంగా తెలియజేస్తున్నాము. కొవిడ్​ కారణంగా చాలామంది రెండేళ్లు వినోదానికి దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ వంటి గొప్ప ఎంటర్​టైన్​మెంట్​ స్పాట్​పై ఆసక్తి చూపుతున్నారు"
-- టీఆర్​ఎల్​ రావు, రామోజీ ఫిల్మ్ సిటీ మార్కెటింగ్ సీనియర్ జనరల్ మేనేజర్

రామోజీ ఫిల్మ్ సిటీ స్టాల్
రామోజీ ఫిల్మ్ సిటీ స్టాల్
Last Updated : Feb 2, 2023, 10:24 PM IST

ABOUT THE AUTHOR

...view details