తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టిఫెన్​ సెంటర్​ ఆదాయం 50 కోట్లు - హైదరాబాద్​లో గ్రాండ్​ ఓపెనింగ్ - 'ఏక్​ దోశ' అంటున్న నెటిజన్లు! - రామేశ్వరం కేఫ్

Rameshwaram Cafe: టిఫెన్ సెంటర్ వద్ద ఓ పాతిక మంది జనం ఉన్నారంటే..? కస్టమర్లు గట్టిగానే ఉన్నారని అర్థం. కౌంటర్ బిజీగానే సాగుతోందని మీనింగ్. కానీ.. ఆ పాతిక మంది సప్లయర్సే అయితే..? ఆ సెంటర్​ ఓ పెళ్లి బంతి భోజనంలా ఉండదూ..? ఏంటి.. టిఫెన్ సెంటర్​కు అంత సీనా అంటున్నారా? సీన్​ కాదు.. ఏకంగా సినిమానే! ఆ సెంటర్ మంథ్లీ​ ఇన్​కమ్​ ఎంతో తెలుసా? జస్ట్.. 4 కోట్ల 50 లక్షల రూపాయలు! మసాలా దోశ ఘాటు నషాళానికి అంటినట్టుగా ఉందా? అలాగే ఉంటది. మరో ఇంట్రస్టింగ్​ విషయం ఏమంటే.. ఈ సెంటర్​ హైదరాబాద్​ నడిబొడ్డున బ్రాంచ్ ఓపెన్ చేయబోతోంది! మరి.. మెయిన్ సెంటర్ ఎక్కడ? ఇంత స్పెషాలిటీ ఏంటి? ఇంతకీ.. ఆ సెంటర్​ పేరేంటి?? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

Rameshwaram Cafe New Branch
Rameshwaram Cafe New Branch

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2023, 12:46 PM IST

Updated : Dec 14, 2023, 1:04 PM IST

Rameshwaram Cafe New Branch Will be Open Soon in Hyderabad: ఐటీ అడ్డా బెంగళూరులోని ఇందిరానగర్ ప్రాంతం. మూడేళ్ల క్రితం వరకు అక్కడ ల్యాండ్​ మార్క్ ఏంటో పెద్దగా తెలియదుగానీ.. ఇప్పుడు అందరికీ ఒకటే మార్క్. అదే.. "రామేశ్వరం కేఫ్". నిత్య కల్యాణం.. పచ్చతోరణం అనే పదానికి ట్రెండీ ఎగ్జాంపుల్​ కావాలంటే.. ఈ టిఫెన్​ సెంటర్​ను​ చూపించొచ్చు. 24/7 కస్టమర్లతో కళకళ.. గల్లాపెట్టె గలగలా అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి! ఇక్కడ నెయ్యితో వేసిన దోశ తిన్నారంటే "మాయమైపోవాల్సిందే" అన్నది ఓ యువకుడి అనుభూతి. సూపర్ క్వాలిటీ ఇడ్లీ తిన్నారంటే.. "ఔర్​ ఏక్ ప్లేట్" ఆర్డర్​ ఇవ్వాల్సిందే అన్నది మరో యువతి ఫీలింగ్. ఈ ఎక్స్​ప్రెషన్స్​ ఎల్లలు దాటి.. ఇంటర్నెట్​ గుండా దేశమంతా విస్తరిస్తున్నాయి. ఈ ఊపులోనే రామేశ్వరం కేఫ్​ను రాష్ట్రం, దేశం సరిహద్దులు కూడా దాటించి.. ఫారెన్​లో బ్రాంచ్​ ఓపెన్ చేసేందుకు చూస్తున్నారు ఓనర్స్!

Famous Temples in Hyderabad : మీరు హైదరాబాద్​లో తప్పక దర్శించుకోవాల్సిన 7 ప్రముఖ దేవాలయాలివే.!

అలా మొదలైంది!ప్రెస్టీజియస్ అహ్మదాబాద్‌ IIMలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ చేసింది దివ్య. CA అడిషనల్​ క్వాలిఫికేషన్. కానీ.. ఏసీ రూమ్​లో కీబోర్డ్​ ముట్టుకోవడం, బ్యాలెన్స్​ షీట్​ చెక్​ చేసుకోవడం వదిలేసి.. ఉడిపి హోటల్​లో గరిట పట్టుకునేందుకు సిద్ధమైంది! రాఘవేంద్రతో చేయి కలిపింది. ఇతనికి ఫుడ్​ ఫ్యాక్టరీలో 15ఏళ్ల ఎక్స్​పీరియన్స్ ఉంది. ఓ కామన్​ ఫ్రెండ్​ ద్వారా కలుసుకున్న వీరిద్దరూ.. ముందు స్నేహితులయ్యారు. ఆ తర్వాత బిజినెస్​ పార్ట్​నర్స్​ అయ్యారు. ఇప్పుడు బ్రేక్​ ఫాస్ట్​ ప్రపంచాన్ని దున్నేస్తున్నారు.

ఏడాదికి రూ.50 కోట్లు..రామేశ్వరం కేఫ్ దూసుకుపోతున్న తీరు.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టిఫెన్​ సెంటర్ మీద ఆదాయమంటే నెలకు ఓ "లకారం" వేసుకోండి! అంతేగానీ లక్షలు దాటి కోట్ల రూపాయల ఇన్​కమ్​ ఏంది సామీ! అన్నది జనాల మాట. ఈ రెస్టారెంట్ నెలకు దాదాపుగా రూ.4.5 కోట్లు ఆర్జిస్తోందని అంచనా. అంటే.. సంవత్సరానికి ఏకంగా 50 కోట్ల పైమాటే! ఈ డీటెయిల్స్​ సెజల్ సుద్ అనే కస్టమర్​ 'X'లో పోస్టు చేశారు. మిగిలిన జనాలు కూడా దీన్ని ధ్రువీకరిస్తున్నారు. ఫేమస్​ టీవీ షో "మాస్టర్‌చెఫ్ ఆస్ట్రేలియా"లోని జడ్జీలలో ఒకరైన ప్రముఖ చెఫ్ గ్యారీ మెహిగాన్ కూడా రామేశ్వరం కేఫ్ గురించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాను తిన్న దోశ గురించి ఒక వీడియోను షేర్ చేయడంతో.. ఈ కేఫ్ మరింతగా వైరల్ అయ్యింది.

Panipuri : నోరూరించే పానీపూరీ.. దీని కథ మీకు తెలుసా?

రెండేళ్ల వయసులోనే!ఒక బిజినెస్​ ఈ స్థాయిలో డెవలప్ కావడానికి ఏళ్లు పడుతుంది. కానీ.. రామేశ్వరం కేఫ్ వయసు కేవలం రెండేళ్లే! 2021లో ఈ కేఫ్ ఫస్ట్ బ్రాంచ్​​ స్టార్ట్ చేశారు. తమదైన క్వాలిటీ.. టేస్ట్​తో అనతి కలంలోనే కస్టమర్ల నమ్మకాన్ని సాధించారు. ఇంకేముంది? జనాలు దారికట్టడం మొదలు పెట్టారు. దీంతో.. నిర్వాహకులు క్రమంగా ఔట్​లెట్లను విస్తరించడం మొదలు పెట్టారు. దోశ, ఇడ్లీ, వడ అంటూ.. సౌత్​ ఇండియా డిషెస్​ మొత్తం లభిస్తాయిక్కడ. ఈ కేఫ్​లో దాదాపు 200 మందికి పైగా పనిచేస్తుంటారు.

బెంగళూరు టూ ఫారెన్ వయా హైదరాబాద్!రామేశ్వరం కేఫ్ పేరు మార్మోగుతుండడంతో.. సాధ్యమైనన్ని ప్రాంతాలకు విస్తరించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ శాఖలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. బెంగళూరు పూరి హైదరాబాద్​లో పొంగనుంది! హైటెక్ సిటీలోని జైన్స్ సద్గురు క్యాపిటల్ పార్క్‌ సమీపంలోని ఇమేజ్ గార్డెన్ రోడ్‌లో రామేశ్వరం కేఫ్ ఓపెన్​ కాబోతోంది. ఇప్పటికే నగరంలో కంచి కేఫ్, తాజా కిచెన్, పంచెకట్టు దోస, తాజా టిఫిన్స్, స్వచ్ మొదలైనవి ఉన్నాయి. రామేశ్వరం వీటికి డిఫరెంట్​గా ఉంటుందని భావిస్తున్నారు. త్వరలోనే రిబ్బన్​ కట్​ చేసుకోబోతున్న ఈ కేఫ్​లో.. టిఫెన్​​ టేస్ట్​ చేయాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కొంత కాలం వరకు ఇక్కడి వెదర్ క్రేజీగా ఉంటుందనడంలో నో డౌట్. సోషల్ మీడియా ద్వారానే ఫుల్​ ఫేమ్ సంపాదించిన రామేశ్వరం కేఫ్​ ముందు.. హైదరాబాదీల సెల్ఫీ షూట్స్​ పోటెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఆర్డర్​ వేయనున్నారు.. "ఏక్ దోశ" అని!

Last Updated : Dec 14, 2023, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details