తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా' - అల్లోపతి వైద్యంపై తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న రామ్​ దేవ్​

అల్లోపతి వైద్యంపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రముఖ యోగా గురువు బాబా రామ్​ దేవ్​ తెలిపారు. అల్లోపతి వైద్యం, వైద్యులను అవమానించేలా బాబా రామ్‌దేవ్‌ మాట్లాడారని భారత వైద్య సంఘం(ఐఎంఏ) తీవ్రంగా ఆరోపించింది.

Ramdev
'నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా'

By

Published : May 24, 2021, 5:34 AM IST

అల్లోపతి వైద్యంపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. అల్లోపతి వైద్యం, వైద్యులను అవమానించేలా బాబా రామ్‌దేవ్‌ మాట్లాడారని భారత వైద్య సంఘం(ఐఎంఏ) తీవ్రంగా ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ తక్షణం స్పందించి ఆయనపై కేసు నమోదుచేయాలని ఆ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

ఈ నేపథ్యంలో బాబా రామ్‌దేవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ స్పందించారు. అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని రామ్‌దేవ్‌కు సూచిస్తూ లేఖ రాశారు. దీంతో బాబా రామ్‌దేవ్‌ అల్లోపతి వైద్యంపై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు. 'మీ లేఖ నాకు అందింది. వైద్య విధానాలపై నేను చేసిన వ్యాఖ్యలపట్ల చింతిస్తున్నాను. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను' అని ట్వీట్‌ చేశారు.

ఇదీ చూడండి:'బాబా మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి'

ABOUT THE AUTHOR

...view details