తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుప్రీంను ఆశ్రయించిన రామ్​దేవ్​ బాబా - రామ్​దేవ్​ బాబా కేసు

యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యల అంశంపై నమోదైన ఎఫ్​ఐఆర్​లన్నింటిని దిల్లీకి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Yoga guru Ramdev
రామ్​దేవ్​ బాబా

By

Published : Jun 23, 2021, 8:40 PM IST

Updated : Jun 23, 2021, 11:05 PM IST

అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో.. తనపై నమోదైన కేసులపై యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశంలోని పలుచోట్ల నమోదైన కేసులను స్తంభింపజేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని రామ్‌దేవ్‌ కోరారు. ఆ ఎఫ్​ఐఆర్​లు అన్నింటిని కలిపి దిల్లీకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కొనసాగుతున్న తరుణంలో అల్లోపతి ఔషధాల సామర్థ్యంపై రామ్‌ దేవ్‌బాబా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. అల్లోపతిని తక్కువ చేస్తూ రామ్‌దేవ్‌ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్‌ అయింది. దీంతో ఆయన తీరుపట్ల భారత వైద్య సంఘం- ఐఎమ్ఏ​ తీవ్రస్థాయిలో మండిపడింది. దేశంలోని పలుచోట్ల ఐఎమ్​ఏ శాఖలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి.

Last Updated : Jun 23, 2021, 11:05 PM IST

ABOUT THE AUTHOR

...view details