తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రామమందిర నిర్మాణానికి రూ.3400 కోట్ల విరాళం.. 11 కోట్ల మంది దాతలు!

Ram janmabhoomi donation: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రూ.3,400 కోట్లు విరాళాలు వచ్చినట్లు ఆలయ ట్రస్ట్​ వెల్లడించింది. 2024 జనవరి నాటికి ఆలయ గర్భగుడి సిద్ధమవుతుందని తెలిపింది.

ram janmabhoomi trust donations
రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు

By

Published : Jul 1, 2022, 9:55 AM IST

Ram janmabhoomi donation: ఉత్తరప్రదేశ్‌.. అయోధ్యలో రామమందిర ఇప్పటివరకు రూ.3,400 కోట్లు విరాళంగా వచ్చినట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు గురువారం తెలిపింది. ఇప్పటి వరకు 11 కోట్ల మంది దాతలు నుంచి ఈ విరాళాలు ఇచ్చినట్లు ప్రకటించింది. కనిష్టంగా రూ. 10 నుంచి గరిష్ఠంగా కోటి రూపాయల వరకు విరాళాలు ఇచ్చారని వెల్లడించింది.

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ రామాలయం నిర్మాణంలో భాగస్వాములుగా మారారని ట్రస్ట్ తెలిపింది. 2024 జనవరి నాటికి ఆలయ గర్భగుడి సిద్ధమవుతుందని వెల్లడించింది. 2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మందిరం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు ఉండనుంది. మూడు అంతస్తులతో నిర్మించనున్న ఈ మందిరం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. రెండున్నర అడుగుల పొడవు ఉన్న 17 వేల రాళ్లను మందిరం నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2020 ఆగస్టు 5న అయోధ్య రామ మందిర నిర్మాణం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వేద మంత్రాల మధ్య ఆలయానికి పునాది రాయి వేశారు. అప్పటి నుంచి నిర్మాణ పనులు చకచకా జరిగిపోతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details