Mahant Nritya Gopal Das: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ న్రిత్య గోపాల్ దాస్ అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో చికిత్స నిమిత్తం ఆయనను లఖ్‌నవూలోని ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ముత్రపిండాల సమస్య తలెత్తడం వల్ల ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయనను మేదంతా ఆసుపత్రిలో చేర్చారు.
రామ్ మందిర్ ట్రస్ట్ చీఫ్ ఆరోగ్యం విషమం - రామజన్మభూమి మందిర్
Mahant Nritya Gopal Das: రామమందిర్ ట్రస్ట్ చీఫ్ న్రిత్య గోపాల్ దాస్ తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. ఆయనను లఖ్‌నవూలోని ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడం వల్ల ఆసుపత్రిలో చేరిన దాస్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ముత్రపిండాల సమస్య కారణంగా ఆయన అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు తెలిపారు.
గోపాల్ దాస్ ఆరోగ్యస్థితిపై వైద్యులు పర్యవేక్షిస్తున్నారుని.. చికిత్సను కొనసాగిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. రామమందిర్‌ను నిర్మిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ్క్షేత్రకు దాస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. దాస్ ఇదివరకు కూడా పలుమార్లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 2020 నవంబరులో శ్వాసకోస సమస్య కారణంగా ఆయన ప్రస్తుతం చేరిన మేదాంత ఆసుపత్రిలోనే చికిత్స పొందారు. 2021 అక్టోబరులో కూడా కొవిడ్ సోకిన కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఇదీ చూడండి :పుల్వామాలో భారీ ఎన్కౌంటర్.. లష్కరే టాప్ కమాండర్ హతం!