ఉత్తర్ప్రదేశ్ అయోధ్యలో నిర్మించనున్న రామాలయం దేశ ఆత్మగౌరవానికి ప్రతీక అని వ్యాఖ్యానించింది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్). రామాలయానికి భూమి పూజను భారతదేశ చరిత్రలో ఓ మలుపుగా అభివర్ణించింది.
మందిర నిర్మాణానికి కావాల్సిన నిధులు సేకరణను ఓ మహా కార్యక్రమంలా నిర్వహించాలని నిర్ణయించింది ఆర్ఎస్ఎస్. ఇందుకోసం దాని అనుబంధ సంస్థల ద్వారా 5 లక్షల గ్రామాల్లో 10 కోట్ల కుటుంబాలకు చేరువ కానున్నట్లు తెలిపింది. గుజరాత్లోని ఉవర్సాద్ గ్రామంలో ఆర్ఎస్ఎస్, మరో 34 అనుబంధ సంస్థల ప్రతినిధులు కలిసి నిర్వహించిన 3 రోజుల సదస్సులో ఈమేరకు చర్చించినట్లు వివరించింది.