అయోధ్యలో రామ మందిరాన్ని దేశ ప్రజల నుంచి సేకరించిన విరాళాలతోనే నిర్మిస్తామని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. విదేశీయుల ద్వారా నిధులను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదని ఆయన చెప్పారు. ఈ విరాళాల కోసం.. రూ.10, 100, 1,000 విలువ గల కూపన్లను కేటాయించామని ఆయన పేర్కొన్నారు. అయితే.. నిధుల సేకరణ కోసం తాము ఎలాంటి లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదని స్పష్టం చేశారు రాయ్.
'దేశీయ విరాళాలతోనే రామ మందిర నిర్మాణం' - అయోధ్య రామాలయ నిర్మాణ కార్యక్రమాలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చారిత్రక రామాలయ నిర్మాణం కోసం.. దేశీయ నిధుల్ని మాత్రమే స్వీకరిస్తామని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. విదేశీ విరాళాలను సేకరించేందుకు కేంద్రం అనుమతి లభించలేదని ఆయన చెప్పారు.
'దేశీయ విరాళాలతోనే రామ మందిర నిర్మాణం'
రామ భక్తుల నుంచి దేశవ్యాప్తంగా సేకరించే ఈ విరాళాల కోసం త్వరలోనే ఓ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామన్నారు రాయ్. దీంతో ఇప్పటికే పూర్తైన ఆలయ నమూనా చిత్రాలు కోట్ల మందికి చేర్చడం సహా.. చారిత్రక ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:రామాలయ నిర్మాణానికి నిపుణుల కమిటీ