తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రాణప్రతిష్ఠకు 7వేల మంది అతిథులు- విదేశాల్లో ఉన్నా స్వయంగా వెళ్లి ఆహ్వానం - అయోధ్య రామమందిరం ఆహ్వానం

Ram Mandir Invitation : అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రాణప్రతిష్ఠకు హాజరయ్యే అతిథులకు ఆహ్వాన పత్రికల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ట్రస్ట్​కు సంబంధించిన ప్రతినిధులు అతిథుల వద్దకు స్వయగా వెళ్లి ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

By PTI

Published : Jan 8, 2024, 2:13 PM IST

Ram Mandir Invitation : అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన ఆహ్వాన పత్రికల పంపిణీని వేగవంతం చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​. ప్రతి ఒక్క అతిథి వద్దకు తమ ప్రతినిధులు స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రిక అందజేస్తున్నట్లు ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి. తమ ప్రతినిధులతో పాటు భారీ సంఖ్యలో ఉన్న వాలంటీర్లు ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నట్లు తెలిపాయి. రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​(RSS), విశ్వ హిందూ పరిషత్​ (VHP), సహా ఇతర అనుబంధ సంఘాలు ఆహ్వాన పత్రికల పంపిణీలో సాయం చేస్తున్నట్లు వివరించాయి. ఇప్పటికే అనేక మంది అతిథులు ఆహ్వాన పత్రికలు అందుకున్నట్లు చెప్పాయి.

హిందీ, ఇంగ్లీష్​ భాషల్లో ముద్రించే ఈ ఆహ్వాన పత్రికలో నూతనంగా నిర్మితమవుతున్న ఆలయం, రాముడి చిత్రాలు కనిపిస్తాయి. దీంతో పాటు రామ జన్మభూమి పోరాటంలో పాల్గొన్న ముఖ్యమైన వ్యక్తుల వివరాలతో కూడిన బుక్​లెట్​ను అందించనున్నారు. ఆలయ ట్రస్ట్​ ఆహ్వానిత జాబితాలో సుమారు 7వేల మంది ఉన్నారు. వీరిలో క్రికెట్​ దిగ్గజాలు సచిన్ తెందుల్కర్​, విరాట్ కోహ్లీ, బాలీవుడ్​ స్టార్ అమితాబ్ బచ్చన్, పారిశ్రామికవేత్తలు ముకేశ్​ అంబానీ, గౌతమ్ అదానీ ఉన్నారు.

"వివిధ రంగాలకు చెందిన వారిని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. అంతరిక్షం రంగం నుంచి కళలతో పాటు కొన్ని తెగలు, శిల్పులు, ఇతర రంగాల్లోని ప్రముఖులను పిలుస్తున్నాం."
--ట్రస్ట్​ సీనియర్​ సభ్యుడు

విదేశీ అతిథులకు స్వయంగానే!
ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత సోనియా గాంధీకి ఆహ్వాన పత్రికలు అందజేశారు ట్రస్టు ప్రతినిధులు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు సైతం ధ్రువీకరించాయి. వీరితో పాటు దేశవ్యాప్తంగా సుమారు 4,000 మంది సాధువులు, 50 మంది విదేశీయులను ఆహ్వానించనున్నారు. విదేశాల్లోని అతిథులకు సైతం స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికలు ఇస్తామని ట్రస్ట్​ సభ్యుడు తెలిపారు. భారత్​లో ఉన్న విధంగానే విదేశాల్లోనూ తమ నెట్​వర్క్ వ్యాపించిందని, ఇతర దేశాల్లో కూడా తమకు వాలంటీర్లు ఉన్నారని చెప్పారు. దీంతో ప్రతి ఒక్క అతిథికి డెలివరీ సర్వీస్​ ద్వారా కాకుండా స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేస్తామన్నారు. భారత్​ నుంచి విదేశాల్లోని వాలంటీర్లకు పత్రికలు పంపుతున్నామని, వారు అతిథుల వద్దకు స్వయంగా వెళ్లి అందజేస్తారని వివరించారు.

మరోవైపు రామజన్మభూమి-బాబ్రీ మసీద్​ కేసులో పిటిషనర్​ ఇక్బాల్​ అన్సారీకి సైతం ఆహ్వాన పత్రికను అందజేశారు. అయోధ్య రామ్​పథ్​లోని ఆయన ఇంటికి వెళ్లి మరీ ట్రస్ట్ సభ్యులు పత్రికను అందించారు. ప్రముఖ టీవీ సీరియల్​ రామాయణంలో సీతారాముల పాత్రలను పోషించిన నటులు అరుణ్​ గోవిల్​, దీపికా చిఖిలియాను ఆహ్వానించారు. రామజన్మభూమి పోరాటంలో ప్రాణాలు అర్పించిన 50 మంది కరసేవకుల కుటుంబ సభ్యులను పిలుస్తామని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్​ ఇప్పటికే చెప్పారు.

'మా ఇంట్లో రాముడు పుట్టాలి, ప్రాణప్రతిష్ఠ రోజే డెలివరీ చేయండి'- వైద్యులను కోరుతున్న గర్భిణులు

అల్లుడిగా రామయ్యకు అన్ని మర్యాదలు!- ఎక్కడో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details