What Is Shuba Muhurtam And Rituals?: అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ రక్షా బంధన్. ఈ పండుగ రోజున అక్కాచెల్లెళ్లు.. వారి సోదరులు తమకు జీవితాంతం అన్ని విషయాల్లో రక్షణగా, అండగా నిలవాలని కోరుతూ.. సోదరుల మణికట్టు చుట్టూ రాఖీలను కడతారు. అయితే.. ఈ ఏడాది రాఖీ పండుగను ఏ రోజున జరుపుకోవాలనే విషయంపై కాస్త గందరగోళం నెలకొంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతున్నారు. మరి, ఏ రోజున రాఖీ పండుగ జరుపుకోవాలి..?, ఏ రోజున శుభ ముహూర్తం ఉంది..?, రాఖీ పండగ ప్రతి ఏడాది ఏ మాసంలో వస్తుంది..?, రాఖీ పండుగను ఎలా జరుపుకుంటారు..? అనే తదితర విషయాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.
రాఖీ పండుగ అంటే ఏమిటి..?
What is Rakhi Festival?:సాధారంగా ఈ పండుగను 'రాఖీ లేదా రక్షా బంధన్' అనే పేరుతో పిలుస్తారు. రక్షా బంధన్.. ప్రతి ఏడాది శ్రావణ మాసం పూర్ణిమ తిథి నాడు వస్తుంది. ఈ పండుగ రోజున సోదరీమణులు.. సోదరుల శ్రేయస్సు, దీర్ఘాయువు కోరుతూ.. వారి సోదరుల మణికట్టు చుట్టూ రాఖీలను కడతారు.
రాఖీ స్పెషల్ స్వీట్స్... తీయని వేడుక చేసుకుందాం!!
రాఖీ 2023 శుభ ముహూర్తం..
The Auspicious Moment Of Rakhi 2023:హిందూ పంచాంగం ప్రకారం.. ఈ ఏడాది రక్షా బంధన్ పండుగ ఆగస్టు 30న (బుధవారం) మొదలవుతోంది. అయితే.. ఆ రోజున భద్ర కాలం ఉంది. ఆగస్టు 30న రాత్రి 9:01 గంటలకు భద్రకాలం ముగుస్తుంది. అందువల్ల ఈ పండుగను ఆగస్ట్ 31న జరుపుకోవటం ఆమోదయోగ్యమైనదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే శాస్త్రాల ప్రకారం.. భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు. భద్ర కాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలి.