తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Raksha Bandhan Wishes and Quotes in Telugu: మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా.. రాఖీ విషెస్​ & స్పెషల్ కోట్స్​ - హ్యాపీ రక్షా బంధన్

Raksha Bandhan 2023 Wishes and Quotes Telugu: అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు ఎంతగానే ఎదురుచూస్తున్న రక్షా బంధన్​ వచ్చేసింది. ఈ నెల 30, 31వ తేదీల్లో ఈ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకోబోతున్నారు. మరి రాఖీ పండుగ రోజున మీకు ఇష్టమైన వారికి శుభాకాంక్షలు ఎలా చెప్పబోతున్నారు..? మీ కోసం కొన్ని అద్భుతమైన కోట్స్ ఇక్కడ అందిస్తున్నాం.

Raksha Bandhan Wishes and special Quotes
Raksha Bandhan Wishes and Quotes in Telugu

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 1:05 PM IST

Raksha Bandhan 2023 Wishes and Quotes Telugu: సోదరులు, సోదరీమణులు ఎంతగానో ఎదురుచూస్తున్న రాఖీ పండుగ వచ్చేసింది. తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ కోసం.. యావత్ దేశం సిద్ధమైంది. పెళ్లి చేసుకుని అత్తింటికి వెళ్లిన ఆడపిల్లలు.. తమ సోదరులు సంతోషంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని కోరుకుంటూ రాఖీని కడతారు. మరి.. మీ ఆత్మీయులకు గ్రీటింగ్స్ ఎలా చెబుతున్నారు? సింగిల్ వర్డ్​లో "రాఖీ శుభాకాంక్షలు" అని కాకుండా.. మీ ప్రేమను, ఆప్యాయతను ప్రతిబింబించే కోట్స్​తో శుభాకాంక్షలు చెప్పండి.

Raksha Bandhan Gift Ideas : మీ సోదరికి రక్షా బంధన్ కానుక ఇవ్వాలా?.. ఈ ఫైనాన్సియల్​ గిఫ్ట్స్​​ ట్రై చేయండి!

Happy Raksha Bandhan Wishes 2023:
రక్షా బంధన్ శుభాకాంక్షలు 2023:

మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా.. రాఖీ విషెస్​ & స్పెషల్ కోట్స్​

"నీ అల్లరే నాకు సంతోషం. ఎప్పటికీ నువ్వు నవ్వుతూనే ఉండాలి. నీ కష్ట సుఖాల్లో తోడుగా ఈ అన్నయ్యా ఉన్నాడు. చిట్టి తల్లికి రక్షా బంధన్ శుభాకాంక్షలు"

మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా.. రాఖీ విషెస్​ & స్పెషల్ కోట్స్​

"అమ్మ తర్వాత అమ్మవి నువ్వు.. నన్ను కంటికి రెప్పలా చూసుకున్నావు. నా అల్లరిని ఎన్నోసార్లు భరించావు. నాకు కష్టం వస్తే తట్టుకోలేవు. అక్కా నువ్వు నా ప్రాణం"

మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా.. రాఖీ విషెస్​ & స్పెషల్ కోట్స్​

నన్ను భుజాల మీదు ఎత్తుకొని పెంచావు. అమ్మ, నాన్నలా నన్ను సాకావు. నీ ప్రేమే నాకు కొండంత అండ. నన్ను దీవించు అన్నయ్యా." రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.

మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా.. రాఖీ విషెస్​ & స్పెషల్ కోట్స్​

"ప్రియమైన అన్నయ్యా.. నేను నీకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తానని ఈ రక్షా బంధన్ సాక్షిగా వాగ్దానం చేస్తున్నాను. రాఖీ పండుగ శుభాకాంక్షలు!"

మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా.. రాఖీ విషెస్​ & స్పెషల్ కోట్స్​

"మన మధ్యనున్న ప్రేమ బంధం ప్రతి ఏడాదీ బలపడుతూనే ఉంది. మనం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ రక్షాబంధన్​ శుభాకాంక్షలు తమ్ముడు"

Happy Raksha Bandhan 2023 Quotes Telugu:
రక్షా బంధన్​ 2023 తెలుగు కోటేషన్స్​:

మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా.. రాఖీ విషెస్​ & స్పెషల్ కోట్స్​

"మన ఇరువురి మధ్య ప్రేమ, అనుబంధం కలకాలమూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.. నీకు రక్షా బంధన్ శుభాకాంక్షలు"

మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా.. రాఖీ విషెస్​ & స్పెషల్ కోట్స్​

"నా జీవితంలో నువ్వు ఎంతో ప్రత్యేకం. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ.. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. హ్యాపీ రక్షాబంధన్"

మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా.. రాఖీ విషెస్​ & స్పెషల్ కోట్స్​

"ఈ ప్రపంచంలోనే మంచి చెల్లెలు నాకుంది. నువ్వు లేకుండా నా జీవితం లేదు. హ్యాపీ రక్షాబంధన్ చెల్లి"

మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా.. రాఖీ విషెస్​ & స్పెషల్ కోట్స్​

"నీ లాంటి అక్క ఉండటం నా అదృష్టం. నువ్వు జీవితాంతం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ రక్షా బంధన్"

Happy Raksha Bandhan Messages Telugu:
హ్యాపీ రక్షా బంధన్ సందేశాలు తెలుగు:

మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా.. రాఖీ విషెస్​ & స్పెషల్ కోట్స్​

అమ్మలో మొదటి అక్షరం.. నాన్నలో చివరి అక్షరం.. అన్నగా మారి అమ్మానాన్నలా చూసుకుంటావు. నీ ప్రేమను మరిచిపోలేను అన్నా"

మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా.. రాఖీ విషెస్​ & స్పెషల్ కోట్స్​

"మన బంధం ఇలాగే సాగాలి అన్నయ్యా.. కష్ట నష్టాల్లో, ఆపదల సమయంలో ఒకరికి ఒకరం తోడుగా ఉందాం"

మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా.. రాఖీ విషెస్​ & స్పెషల్ కోట్స్​

"ప్రియమైన సోదరీమణులారా.. జీవితంలో అన్ని సంతోషాలు మీకు కలగాలని కోరుకుంటూ.. రక్షా బంధన్ 2023 శుభాకాంక్షలు"

మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా.. రాఖీ విషెస్​ & స్పెషల్ కోట్స్​

"నా ప్రియమైన సోదరుడికి రక్షాబంధన్ శుభాకాంక్షలు. నువ్వెప్పుడూ సంతోషంగా, క్షేమంగా ఉండాలని ఈ రాఖీ సందర్భంగా ప్రత్యేకంగా కోరుకుంటున్నా."

Raksha Bandhan Festival 2023 : రాఖీ పండుగ ఏ రోజు.. ఆగస్టు 30.. 31?

ABOUT THE AUTHOR

...view details