Rakhi For Soldiers :రక్షాబంధన్ సందర్భంగా ఛత్తీస్‌గఢ్.. బిలాస్‌పుర్ జిల్లాలోని సాయిమౌళి ఆలయ కమిటీ.. దేశ సైనికుల కోసం ప్రత్యేకమైన రాఖీని సిద్ధం చేసింది. పంజాబ్‌లోని ఉధంపుర్ సైనికులకు పంపేందుకు.. 27 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో రాఖీని తయారు చేసింది. ఈ ప్రత్యేకమైన రాఖీలో 21 వీరజవాన్ల ఫొటోలను అమర్చింది. వీరి పేర్లను ఇటీవలే భారత ప్రభుత్వం.. 21 అండమాన్ నికోబర్ దీవులకు పెట్టింది.
మోదీ, ద్రౌపదీ ముర్ము ఫొటోలు కూడా..
Rakhi Making For Soldiers : ఈ ప్రత్యేకమైన రాఖీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ చిత్రాలను కూడా ఉంచారు. వీరితోపాటు పరమవీరచక్ర విజేతల ఫొటోలు కూడా పెట్టారు. మొత్తంగా 27 ఫొటోలు ఉన్నాయి. ఈ రాఖీని సాయిమౌళి ఆలయ కమిటీ.. జిల్లా సైనిక్ సంక్షేమ బోర్డు బిలాస్‌పుర్ అధికారుల ద్వారా రోడ్డు మార్గంలో ఉధంపుర్‌కు తరలించింది. ఈ కమిటీ గతేడాది 15 అడుగుల పొడవైన రాఖీని తయారు చేసి లద్దాఖ్ సైనికులకు పంపింది.
'కొన్నినెలల పాటు కష్టపడి..'
Rakhi Message For Soldiers : ఈ ప్రత్యేక రాఖీ గురించి కమిటీ సమన్వయకర్త దిలీప్ దేవర్కర్ పాత్రేకర్.. ఈటీవీ భారత్‌తో మాట్లాడారు. "దేశంలోని సైనికులకు వారి ఇంటి నుంచి వచ్చిన రాఖీ చేరడం కష్టం. ఒకవేళ చేరిన అది చిన్నగానే ఉంటుంది. అందుకే మేం ఈ ప్రత్యేకమైన రాఖీని తయారు చేశాం. గతేడాది రెండున్నర అడుగుల వెడల్పు, 15 అడుగుల పొడవు ఉన్న రాఖీని తయారు చేసి.. లద్దాఖ్‌కు పంపాం. ఈ సారి కాస్త భిన్నంగా తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకే కొన్ని నెలలపాటు కష్టపడి 27 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో రాఖీ తయారు చేశాం" అంటూ చెప్పుకొచ్చారు.