సాగు చట్టాలను ఎట్టిపరిస్థితుల్లోనూ రద్దు చేయాల్సిందేనని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ కేంద్రానికి అల్టిమేటం జారీచేశారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ చట్టాలను 'నల్ల చట్టాలుగా' అభివర్ణించిన ఆయన.. త్వరలో లఖ్నవూలో జరగనున్న కిసాన్ మహాపంచాయత్ వేదికగా వాటికి సమాధి కడతామని స్పష్టం చేశారు.
"పూర్వాంచల్‌లోనూ రైతు ఉద్యమం ఉద్ధృతం అవుతోంది. నవంబర్ 22న లఖ్నవూలో జరిగే చారిత్రక కిసాన్ మహాపంచాయత్తో.. రైతు వ్యతిరేక ప్రభుత్వానికి, మూడు నల్ల చట్టాలకు గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది."