తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్నికల వేళ బంగాల్​కు టికాయిత్​

కీలకమైన బంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు రైతు నేత రాకేశ్ టికాయిత్. వ్యయసాయ చట్టాలకు వ్యతిరేకంగా మాహాపంచాయత్​లో పాల్గొననున్నారు. భాజపా.. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరనున్నట్లు ఇటీవల రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో టికాయిత్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Rakesh Tikait to visit WB 14 days ahead of polls
ఎన్నికల వేళ బంగాల్​కు టికాయిత్​.. భాజపాకు ఎదురుదెబ్బ?

By

Published : Mar 5, 2021, 10:38 AM IST

Updated : Mar 5, 2021, 11:00 AM IST

ప్రతిష్టాత్మక బంగాల్​ అసెంబ్లీ పోరుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతున్న వేళ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్​కేఎం) నేత రాకేశ్ టికాయిత్ ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎన్నికలకు 14రోజుల ముందుగానే మార్చి 13న ఆయన బంగాల్ వెళ్లనున్నారు. అక్కడ ఏర్పాటు చేసే మహాపంచాయత్​లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రసంగించనున్నారు.

రైతుల ఉద్యమం గురించి ప్రజలకు అవగాహన కల్పించి వారి నుంచి మద్దతు కూడగట్టడానికి దేశవ్యాప్తంగా మహాపంచాయత్​లు నిర్వహిస్తున్నారు రైతు నేతలు. అందులో భాగంగా త్వరలోనే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనూ పర్యటించనున్నట్లు ఎస్​కేఎం తెలిపింది. "రైతు, పేదలకు వ్యతిరేకంగా ఉన్న భాజపా విధానాలను ఎండగట్టి, ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరనున్నాం" అని ఆ సంఘం వివరించింది.

డా.దర్శన్ పాల్, యోగేంద్ర యాదవ్, బల్బీర్ సింగ్ సహా ఇతర రైతు నేతలు మహాపంచాయత్​లో మార్చి 12న పాల్గొననున్నారు.

294 అసెంబ్లీ స్థానాలున్న బంగాల్​లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి:టీఎంసీ నుంచి భాజపా గూటికి మరో కీలక నేత

Last Updated : Mar 5, 2021, 11:00 AM IST

ABOUT THE AUTHOR

...view details