తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇది వ్యాపారులు నడిపిస్తున్న ప్రభుత్వం'

కేంద్ర ప్రభుత్వం బడా వ్యాపారులు నడిపిస్తున్న ప్రభుత్వమని అన్నారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్. బంగాల్​ పర్యటనలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

rakesh-tikait-fired-on-central-government
'ఇది వ్యాపారులు నడిపిస్తున్న ప్రభుత్వం'

By

Published : Mar 14, 2021, 10:40 PM IST

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తోన్న ఆందోళనలు డిసెంబర్‌ వరకు కొనసాగుతాయని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయత్‌ తెలిపారు. బంగాల్​ పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... నూతన వ్యవసాయ చట్టాలు చిన్న వ్యాపారాలు, పరిశ్రమల మూసివేతకు దారితీస్తాయని, కేవలం వాల్‌మార్ట్‌ లాంటి పెద్ద పెద్ద మాల్స్‌కు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. వివిధ పంటలకు కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చే చట్టాలను తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

"కేంద్ర ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీకి చెందినది అయితే రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేది. కానీ, ఇది బడా వ్యాపారులు నడిపిస్తున్న ప్రభుత్వం. దేశం మొత్తాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తోంది"

-రాకేశ్‌ టికాయత్‌, బీకేయూ నేత.

దేశమంతా పర్యటిస్తా..

దిల్లీలో తాను ఒక్కడినే ఆందోళన చేయనని, దేశమంతా పర్యటించి రైతులను కలుస్తానని రాకేశ్‌ టికాయత్‌ వెల్లడించారు. ఈ నెలలో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:ఒకే కుటుంబంలో 14 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details