భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు ఉద్యమం విస్తరణలో భాగంగా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్ర రైతుల మద్దతు కూడగడతానని ప్రకటించారు. ఇందుకోసం ఈనెల 20న ఆ రాష్ట్రాల్లో పర్యటిస్తానని వెల్లడించారు. ప్రస్తుతం పంజాబ్, హరియాణా, గుజరాత్, రాజస్థాన్ రైతులు నిరసనలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. హరియాణాలోని హిసార్లో పర్యటిస్తున్న సందర్భంగా.. టికాయిత్ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు.
"గత 70 ఏళ్లుగా రైతులు వ్యవసాయంలో నష్టపోతూనే ఉన్నారు. ఇప్పుడు ఓ పంటను త్యాగం చేయాలి. అందుకు వారు సిద్ధంగా ఉన్నారు. పంటకోతకు కూలీలను నియమించుకుంటారే కానీ ఉద్యమం నుంచి నిష్క్రమించరు."
-రాకేశ్ టికాయిత్, బీకేయూ నేత