Parliament monsoon session 2022: ధరల పెరుగుదల, జీఎస్టీ రేట్ల పెంపుపై కాంగ్రెస్ ఎంపీల ఆందోళనల నడుమ.. రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. దీంతో.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజే సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.
అంతకుముందు.. కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, రాజీవ్ శుక్లా, మీసా భారతి, ప్రఫుల్ పటేల్, హర్భజన్‌సింగ్, విజయేంద్రప్రసాద్ ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత.. ఎగువసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో.. కొందరు కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని, అలాగే రాష్ట్రపతి ఎన్నికలోనూ ఓటేసేందుకు వీలుగా సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు వెంకయ్య. సోమవారం సభ ప్రారంభమైన తర్వాత.. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, యూఏఈ మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫాకు నివాళి అర్పించారు ఎంపీలు.