తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హెల్త్​కేర్ ప్రొఫెషన్స్​ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

కేంద్రం ప్రవేశపెట్టిన నేషనల్​ కమిషన్​ ఫర్​ అలైడ్​ హెల్త్​కేర్​ ప్రొఫెషన్స్ బిల్లు- 2020కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆరోగ్య రంగానికి సంబంధించి పెండింగ్​లో ఉన్న డిమాండ్​లను తీర్చే విధంగా ఈ బిల్లును రూపొందించామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్​ పేర్కొన్నారు.

health care
హెల్త్​కేర్ ప్రొఫెషన్స్​ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

By

Published : Mar 17, 2021, 7:30 AM IST

Updated : Mar 17, 2021, 12:29 PM IST

ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన విద్యాప్రమాణాల నిర్వహణ, అనుబంధ వృత్తినిపుణుల సేవల క్రమబద్ధీకరణకు వీలు కల్పించే.. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్​ అండ్ హెల్త్​కేర్ ప్రొఫెషన్స్​ బిల్లు- 2020కి మంగళవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది.

"హెల్త్​కేర్​ రంగానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్​ ఉందని గుర్తించాము. ఈ బిల్లు ద్వారా 8-9 లక్షల మంది అనుబంధ వృత్తినిపుణులు లబ్ధిపొందడమే కాక భవిష్యత్తులో మరిన్ని ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆరోగ్య రంగానికి సంబంధించి పెండింగ్​లో ఉన్న డిమాండ్​లను తీర్చే విధంగా ఈ బిల్లును రూపొందించాము. దీని ద్వారా ఈ రంగంలో ఉన్న విభాగాలకు అత్యున్నత ప్రమాణాలు ఉండే విధంగా తీర్చిదిద్దడం సులవు అవుతుంది."

-హర్షవర్ధన్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

ఇదీ చదవండి :దీదీకి ఈసీ ఘాటు లేఖ

Last Updated : Mar 17, 2021, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details