తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లతా మంగేష్కర్​కు రాజ్యసభ నివాళి - లతా మంగేష్కర్​కు రాజ్యసభ నివాళి

లతా మంగేష్కర్‌కు రాజ్యసభ నివాళులర్పించింది. ఎగువసభలో ఆమె సంస్మరణ సందేశాన్ని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు చదివి వినిపించారు.

a
a

By

Published : Feb 7, 2022, 10:17 AM IST

Updated : Feb 7, 2022, 10:51 AM IST

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ మృతికి రాజ్యసభ నివాళులర్పించింది. ఉదయం 10 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు లతా మంగేష్కర్‌ను స్మరించుకుంటూ సందేశం చదివారు. 'లతాజీ మరణంతో ఈ దేశం ఓ గొప్ప గాయని, దయామూర్తిని, మహోన్నత వ్యక్తిత్వాన్ని కోల్పోయింది. ఆమె మరణం.. ఓ శకానికి ముగింపు. సంగీత ప్రపంచంలో ఆమె లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిది' అని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సంతాపం తెలియజేశారు. ఆ తర్వాత సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. లత గౌరవార్థం సభను గంట పాటు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు.

అటు సాయంత్రం లోక్‌సభ కూడా లతాజీకి నివాళులర్పించి గంట పాటు సభను వాయిదా వేయనుంది.

92 ఏళ్ల లతా మంగేష్కర్ జనవరి 11న కొవిడ్‌ స్వల్ప లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె కరోనా నుంచి కోలుకొన్నట్లు వైద్యులు, కుటుంబసభ్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే శనివారం లతా మంగేష్కర్‌ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు.

Last Updated : Feb 7, 2022, 10:51 AM IST

ABOUT THE AUTHOR

...view details